పాలకులు మారిన పాలసీలు మారిన వికలాంగుల సంక్షేమం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపట్ట వల్సి ఉండగా పాలకులు వికలాంగుల పట్ల వివక్ష చూపుతున్నారు. హామీలు ఇచ్చి అమలు చేయడం లేదు
తెలంగాణ రాష్ట్రంలో 21 రకాల వైకల్యాల ప్రకారం సుమారు 43.04 లక్షల మంది వికలాంగులు ఉన్నారనీ తెలిపారు .పెరుగుదలకు అనుగుణంగా ప్రస్తుతం ఇస్తున్న 4016 నుండి 10, 000లకు పెన్షన్ పెంచాలి ప్రతినెల 5వ తేదీలోపు పెన్షన్లు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆసరా పెన్షన్లకు ఆదాయపరిమితి విధించే జీఓ నెంబర్ 17 రద్దు చేయాలి 40 శాతం వైకల్యం కలిగిన వికలాంగు లందరికీ పెన్షన్లు మంజూరు చేయాలి. నామినేటెడ్ పదవుల్లో వికలాంగులకు రిజర్వేషన్స్ కల్పిస్తూ అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయాలి.వికలాంగుల కుటుం బాలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలి.వైకల్య ధ్రువీకరణ పత్రం కలిగిన వికలాంగులకు ఆర్టీసీ మరియు రైల్వేలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి. 40 శాతం వైకల్యం కలిగిన వారందరికీ బస్‌పాసులు ఇవ్వాలి.ఉద్యోగ నియామకల్లో శారీరక వికలాంగుల రోస్టర్ 10లోపు తగ్గించాలి.
ప్రభుత్వ శాఖల్లో ఖాలీ గా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి.వికలాంగుల సంక్షేమం, సాధికారత కోసం వికలాంగుల బంధు పథకం ప్రవేశపెట్టాలి. దళిత బంధు పథకంలో వికలాంగులకు ఐదు శాతం కేటాయించాలి. నిరుద్యోగ వికలాంగులకు స్వయం ఉపాధి కోసం ఐదు లక్షల ఆర్థిక సాయం చేయాలి స్వయం ఉపాధి యూనిట్ల సంఖ్య ప్రతి మండలానికి 50కి పెంచాలి నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం శిక్షణ కేంద్రాల ఏర్పాటు చేయాలి.ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల్లో ఐదు శాతం వికలాంగుల కేటాయించాలి 2016 చట్టం పేర్కొన్న విధంగా సాధారణ లబ్ధిలో 25 శాతం అదనంగా వికలాంగులకు అన్ని ప్రభుత్వ పథకాలు చెల్లించాలి.వికలాంగులకు అంచోదయ రేషన్ కార్డులు ఇవ్వాలి. రేషన్ షాపులు ద్వారా నిత్యవసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలి.డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు గృహలక్ష్మి పథకంలో ఐదు శాతం కేటాయించాలి వివాహం కాని వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. స్థలం లేని వికలాంగులకు 120 గజాల స్థలం కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలి.21 రకాల వైకల్యాలకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలి ప్రతి నెల సదరం క్యాంపు ఏర్పాటు చేయాలి. కాలపరిమితి ముగిసిన సదరం సర్టిఫికెట్ రెన్యువల్ చేయాలి.
.ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రత్యేక టీచర్లను నియమించాలి బదిరులు అందులో శారీరక వికలాంగుల కోసం గురుకుల పాఠశాలలు జూనియర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయాలి .జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆటిజం, వినికిడి పరీక్షలు మానసిక వైకల్యం కలిగిన పిల్లల కోసం ప్రత్యేక థెరపీ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ దవాఖానా
ల్లో ఆడియాలజిస్టులను నియమించాలి.వైకల్య తీవ్రతను బట్టి మోటర్ వెహికల్స్ బ్యాటరీ వీల్స్ ఇవ్వాలి పరికరాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని నిబంధన రద్దు చేయాలి దరఖాస్తు చేసిన వారికి పరికరాలు పంపించేయాలి.తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులు వారి సహాయకులకు 25 వేల ప్రత్యేక చెల్లించాలి వ్యాధిగ్రస్తులకు ఉచితంగానే మందులు సరఫరా చేయాలి. వికలాంగులకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిం చాలి. తల సేమియా, సికిల్ సెల్, ఇమోఫిలియా వ్యాధి కలిగిన వారికి ఉచితంగా రక్తం సరఫరా చేయా లి.హైదరాబాద్ లో ఐదు ఎకరాల స్థలంలో వికలాంగుల భవనం ప్రతి జిల్లా కేంద్రంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రాల్లో వికలాంగుల భవనాలు నిర్మించాలి. వికలాంగులపై జరుగుతున్న వేధింపులు అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి మహిళలు, బాలికలైన వికలా ంగులపై అత్యాచారాలు లైంగిక వేధింపులు జరగకుండా చర్యలు తీసుకోవాలి.వికలాంగులైన కళాకారులను వృత్తి కళాకారులు గుర్తించి సాంస్కృతిక శాఖ ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలి సాంస్కృతిక సారథి ఉద్యోగాల్లో నాలుగు శాతం కేటాయించాలి.వికలాంగుల వివాహ ప్రోత్సాహకం రెండున్నర లక్షలకు పెంచాలి ఇద్దరు వికలాంగులు వివాహం చేసుకుంటే 5 లక్షల రూపాయల ప్రోత్సాహకం ఇవ్వాలి విద్యారతను బట్టి ఉద్యోగం ఇంటి స్థలం ఇవ్వాలి.
వికలాంగుల్లోని క్రీడాకారులను గుర్తించి వసతితో కూడిన శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న వారికి వసతి ప్రయాణం ఖర్చులు ప్రభుత్వమే భరించాలి. వికలాంగుల క్రీడల కోసం 500 కోట్లు కేటాయించాలి. సామూహిక ప్రాంతాలన్నీ ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు రాంపుల్ నిర్మించాలి రాష్ట్రంలోని రైల్వే స్టేషన్స్ ఆర్టీసీ బస్ స్టేషన్స్ వికలాంగుల వినియోగి ంచుకునే విధంగా నిర్మాణం చేయాలి .2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. పర్యవేక్షణ కోసం రాష్ట్ర జిల్లా మండల స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలి.పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికోసం రాష్ట్ర కేంద్రంతో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి ఉచిత శిక్షణ వసతి మెటీరియల్ ఇవ్వాలి.ప్రభుత్వం నుండి సహాయం పొం దుతున్న ప్రైవేట్ సంస్థలు నాలుగు శాతం ఉద్యోగాలు వికలా ంగుల ఇవ్వాలి.పంచాయతీరాజ్ మున్సిపల్ ఆర్టీసీ శాఖలు నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్‌లో 25% అద్దెకి షాప్స్ కేటాయించాలి.
మద్యం పాలసీ ఇండస్ట్రియల్ పాలసీలో సవర ణలు చేసి ఐదు శాతం వికలాంగుల కేటాయించే విధంగా పాలసీలను మార్చాలి. వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న టీసీపీసీ కేంద్రాలను బలోపేతం చేయాలి. మూసి వేసిన టీసిపిసి సెం టర్స్ తెరవాలి. ప్రతి జిల్లా కేంద్రంలో టీసీపీసీ సెంటర్స్ ను ఏర్పాటు చేయాలి. వికలా ంగుల కార్పొరేషన్ ద్వారానే తయారు చేయించాలి. వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా మారుస్తూ విడుదల చేసిన జీఓ నెంబర్ 33 ను అమలు చేసి 33 జిల్లాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ సిబ్బందిని నియమించాలి ప్రభుత్వ బడ్జెట్లో ఐదు శాతం కేటాయించాలి.
ప్రభుత్వ శాఖలన్నీ ఐదు శాతం నిధులు వికలాంగుల సంక్షేమానికి ఖర్చు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.. మానసిక వికలాంగుల కోసం జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక హోం ఏర్పాటు చేయాలి 33 జిల్లాల్లో వికలాంగుల కోసం హాస్టల్స్ హోమ్స్ నిర్మించాలి. మాటలతో గారడీలు చేయడం మాని కార్యాచరణ చూపాలి.
` రావుల రాజేశం లెక్చరర్.
సామాజికవేత్త, 9848811424