ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 12 : కడ్తాల గ్రామపంచాయతీ పరిధిలో ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో నాలుగు రోజులపాటు జరిగే బోనాల ఉత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి తెలిపారు. మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల సందర్భంగా ఉదయం ఆలయంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలతో కలిసి అమ్మవారి అభిషేక కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో వర్షాలు విరివిగా కురవాలని, పాడి పంటలతో గ్రామం కలకలలాడాలని, గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఆర్థికాభివృద్ధి చెందాలని, గ్రామ ప్రజలు పూర్తి ఆరోగ్యంతో ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ దైవభక్తితో బోనాల కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ సంస్కృతికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని మన సంస్కృతికి విశిష్ట ప్రతీక బోనాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ లాయాక్ అలీ, కో ఆప్షన్ సభ్యుడు జాంగిర్ బాబా, వార్డు సభ్యులు నరేందర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి గురిగళ్ళ లక్ష్మయ్య, సత్యం యాదవ్, చేగురి రాములు, మల్లేష్ గౌడ్, యాదగిరి రెడ్డి, మంకీ శ్రీను, రాఘవేందర్, యాదయ్య గౌడ్, శ్రీరాములు, జంగయ్య, చంద్రయ్య, ముత్తి కృష్ణ, వెంకటయ్య, కొప్పు కృష్ణ, అంజి, నాగార్జున, రాజ శేఖర్, కరుణాకర్ తదితరులు పాల్గొ.