శ్రీ చెన్నకేశ్వర స్వామి నూతన కమిటీ చైర్మన్ గా కళ్యాణ్ కార్ రూప్ చందర్ నియామకం

కందుకూరు,ప్రజాతంత్ర,సెప్టెంబర్12 :మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం నేదునూరు గ్రామ శ్రీ చెన్నకేశ్వర స్వామి నూతన కమిటీ చైర్మెన్ గా కళ్యాణ్ కార్ రూప్ చందర్ నియామకం అయ్యారు. దేవాలయ కమిటీని పూర్తిస్థాయిలో దేవదాయ ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ ప్రణీత్ నియమించారు.కమిటీ సభ్యులుగా వీరమల్ల శ్రీరాములు,పెద్దింటి యాదిరెడ్డి,మర్ల అంజయ్య యాదవ్,చక్రవర్తుల శ్రీనివాస్ చార్యులను నియమించినట్టు ఆయన తెలిపారు.కమిటి సభులచే ఆలయ ఆవరణలో ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు.ఈ సందర్భంగా చైర్మన్ కళ్యాణ్ రూప్ చందర్ మాట్లాడుతూ,రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, సర్పంచ్ రామకృష్ణారెడ్డి,గ్రామ పెద్దల సహాయ సహకారాలతో తలను ఆలయ చైర్మన్ గా నియమించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.నూతన కమిటీకి మంత్రి ఎంతో కృషి చేశారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో కందుకూరు మండల జెడ్పిటిసి బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ చంద్రశేఖర్, ఉపసర్పంచ్ శ్రీనివాస్,రైతు విభాగం మండల అధ్యక్షులు సోలిపేట అమరేందర్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ సాధ పాండురంగారెడ్డి, కందుకూరు మండలం ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సురసాని రాజశేఖర్ రెడ్డి, దాసర్లపల్లి మాజీ సర్పంచ్ దేవేందర్,ఉన్ని వెంకటయ్య,పిరికిటి మనోహర్,బిఆర్ఎస్ నాయకులు సదానంద గౌడ్,మేఘనాథ్ రెడ్డి, గోపాల్ రెడ్డి,బొక్క దీక్షిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page