‘‘దేశంలో రక్షిత ప్రాంతాలు మానవాళి అభివృద్ధి వేగానికి వేలైన్లుగా భూగోళంపై నివసిస్తూ ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ వస్తున్నటువంటి అనేక జీవజాతులు క్రమక్రమంగా అంతరించిపోతున్నాయి.’’
దేశంలో రక్షిత ప్రాంతాలు మానవాళి అభివృద్ధి వేగానికి వేలైన్లుగా భూగోళంపై నివసిస్తూ ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ వస్తున్నటువంటి అనేక జీవజాతులు క్రమక్రమంగా అంతరించిపోతున్నాయి. ఎన్నో జీవులు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొం టున్నాయి. ఇటువంటి పరిస్థితి ఎదురు కాకుండా కొంతలో కొంతైనా నివారించే ందుకుగాను ప్రతి దేశం తన భూభాగం పరిధిలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించి, ఉన్న జీవుల రక్షణకు కట్టుదిట్టమైనటువంటి చర్యలను చేపట్టింది. వన్య ప్రాణుల సంరక్షణ చర్యలను తీసుకుంటుంది.గతంలో చూసినట్లయితే ఈ చర్యలు స్వాతంత్రం రాకముందే భారత దేశంలో బ్రిటిష్ పాలన కాలంలోనే ప్రారంభమయ్యాయి. స్వాతం త్య్రం సాధించిన తర్వాత భారత ప్రభుత్వం అనేక ప్రాంతాలను వన్యప్రాణి రిజర్వులుగా ప్రకటించి పర్యావరణ మార్పులను సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగు తున్నటువంటి ప్రస్తుత తరుణంలో దేశంలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల గురించి ఆలోచించి, వాటికి సంరక్షణ అధికారులను కేటాయించి వన్యప్రాణులను కాపాడుతుంది ప్రభుత్వం.1898లో జంతు సంపాదన పరిరక్షించడానికి మొదట పక్షుల అభయరానాణ్యన్ని తమిళనాడులో వేదాంతంగాల్ ఏర్పాటు చేసింది.
1935లో మొదటి పార్కుగా ఉత్తరప్రదేశ్ లోని హేళి జాతీయ పార్కులో ఏర్పాటు చేసింది.దీన్ని ఇప్పుడు జిమ్ కార్బెట్ పార్క్ గా పిలుస్తున్నారు. మన దేశం మొత్తంలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు గాను జాతీయ పార్కులు ఉన్నాయి. వన్యప్రాణుల సంరక్షణ అనేది ఆరోగ్యకరమైన వన్యప్రాణుల జాతులు నిర్వహించడానికి పర్యావరణాన్ని వ్యవస్థలను పునరుద్ధరించడానికి, రక్షించడానికి, అడవి జాతులను మరియు వాటి ఆవాసాలను రక్షించే పద్ధతిని గురించి తెలియజేస్తుంది.ముప్పులలో భాగంగా నివాస విధ్వంసం, అదోకరణం, విచ్ఛిన్నం, అతిగా దోపిడీ, వేటాడడం,కాలుష్యం, వాతావరణ మార్పులు,అక్రమ వన్యప్రాణుల వ్యాపారం ఇలా చాలా రకాలుగా చెప్పవచ్చు.ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో 42,100 జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి అంచనా వేసింది. ఉన్నటువంటి అన్ని జాతులను విస్తరిస్తూ జీవవైవిధ్యం పై 2019 యూనియన్ నివేదిక ఈ అంచనాను మిలియన్ జాతుల వద్ద మరింతగా ఉంటుందని తేల్చి చెప్పింది.అంతరించిపోతున్నటువం
ఈ సమస్యలను పరిష్కరించడానికి భూమి పైన ఉన్న వన్యప్రాణులను సంరక్షించడానికి జాతీయ మరియు అంతర్జాతీయ ప్రభుత్వాలు ప్రయత్నాలు చెస్తున్నాయి.వన్యప్రాణుల సంరక్షణ చట్టాలను చూసినట్లయితే భారతదేశ వన్యప్రాణి సంరక్షణ చట్టం -1972,అటవీ, పక్షుల, జంతువుల భద్రతా చట్టం – 1912,భారతీయ ఏనుగుల భద్రత చట్టం – 1879,బెంగాల్ ఖడ్గమృగ చట్టం -1932,మద్రాసు అటవీ ఏనుగుల చట్టం -1873,అసోం ఖడ్గమృగ భద్రత చట్టం -1954, అంతేకాకుండా ఆదేశిక సూత్రాల్లోని 48వ ప్రకరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వన్య ప్రాణులను సంరక్షించాలని పేర్కొంది.అదేవిధంగా 51ఏ ప్రకారం వన్యప్రాణుల సంరక్షణ పౌరుల ప్రాథమిక విధిగా పేర్కొంది.42వ సవరణ ద్వారా వన్యప్రాణుల సంరక్షణ రాష్ట్రజాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి మార్చారు.జాతీయపార్కులు 2014 ఏప్రిల్ నాటికి 166 జాతీయ పార్కులు ఆమోదించబడి ఉంటే వాటిలో 102 జాతీయ పార్కులు ఏర్పాట య్యాయి. వీటిలో కూడా వన్యప్రాణులకు, వీటితో పాటు పశుసంపదకూ రక్షణ లభిస్తుంది.
జాతీయ హోదా ఇవ్వబడిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలే జాతీయపార్కులు. ప్రపంచంలో మొదటి జాతీయపార్కును అమెరికాలోని యోమింగ్ ప్రాంతంలో ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ (1872) ఏర్పాటు చేశారు. అంతరించిపోతున్న టువంటి జంతుజాలం వృక్షజాతులు జీవవైవిద్యం పైన ప్రభుత్వము,ఇతర స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి.వాటి సంరక్షణకు పాటుపడుతున్నాయి.దేశంలో ఈ విధంగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోని అడవుల్లో వన్యప్రాణి సంపదను పొందించేటువంటి దిశగా అటవీశాఖ చర్యలు తీసుకుంటుంది జూపార్కులలోను పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి శాఖాహార జంతువులను కాపాడుతూనే, మాంసాహార జంతువులైనటువంటి పులులకు అభయారణ్యాలు రక్షిత అటవీ ప్రాంతాలను తరలించేందుకు నిర్ణయించింది. పెద్ద సంఖ్యలో ఉన్న శాఖాహార జంతువులను అభయారణ్యాలకు తరలించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. వరంగల్ కాకతీయ జూ పార్క్ నుంచి 20 చుక్కల దుప్పులు, 13 సాంబార్ జింకలు, ఆరు నెమళ్ల ను ఏటూరునాగారం అభయారణ్యానికి, నెహ్రూ జూపార్క్ నుంచి 19 చుక్కల దుప్పులను అమ్రబాద్ టైగర్ రిజర్వుకు తరలించారు.రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ లో జూపార్కులు, శామీర్ పేట, కిన్నెరసాని వంటివే కాకుండా కరీంనగర్ లో జింకల పార్కులో పెద్ద సంఖ్యలో వివిధ రకాల జింకల సంతతిని పెంపొందించే దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నారు.ఏటూరు నాగారం, పాకాల అభయారణ్యాలలో జంతు సమతు ల్యత పెంచేలా ఈ చర్యలు దోహదపడతాయని అధికారులు తెలుపుతున్నారు.
వన్య ప్రాణులకు అవసరమైనటువంటి వసతుల్లో భాగంగా నివాసము, మైదానాలు, నీటి వసతి ఉండేలా చర్యలు తీసుకోవడమే కాకుండా నిబంధనల మేరకు జంతువులకు ఆరోగ్య పరీక్షలు కూడా చేయించి, అవసరమైనటువంటి టీకాలను ఎప్పటికప్పుడు వేయించి, ఆరోగ్య రీత్యా కూడా చూసుకుంటున్నారు. ఇలా చేసినట్లయితేనే వన్యప్రాణుల సంరక్షణ సాధ్యమవుతుంది.అటవీ ప్రాంతాల్లో జీవించే వన్య ప్రాణులు వేసవిలో నీటి కొరతతో ప్రాణాలు కొల్పోకూడదనే ఉద్దేశంతో అటవీశాఖ చర్యలు చేపట్టింది.వేసవిలో నీటి కోసం జంతువులు సమీప పొలాల్లోనే నీటి వనరుల వద్దకు వచ్చిన క్రమంలో కొందరు వేటగాళ్లు వన్య ప్రాణులను వేటాడుతున్నారు.వేటగాళ్ల బారిన ఈ వన్య ప్రాణులు పడకుండ ఉండటానికి వాటి కోసం అటవీ ప్రాంతాల్లోనే ప్రత్యేక నీటి గుంతలు ఏర్పాటు చేయడంతోపాటు, అటవీ ప్రాంతంలో భూమికోతకు గురికాకుండ భూసారాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో అటవీశాఖ పలు చర్యలు తీసుకుంది. సహజ నీటి వనరులు లేని చోట నీటిని అందుబాటులో ఉంచే విధంగా చెక్‌డ్యాంలు, ససార్ పిట్లు, నీటికుంటలు, చెక్‌వాల్స్ సోలార్ బోర్లను ఏర్పాటు చేశారు.అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు వన్యప్రాణులు బలవుతున్నాయి. వేటగాళ్ల ఆటకట్టించేందుకు, అటవీ సంపదను కాపాడేందుకు అటవీశాఖ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. వేటగాళ్లపై నిరంతర నిఘా పెట్టి వారి కదలికను నియంత్రిస్తున్నారు.అభయారణ్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు గూడేలలో గార్డుల నిఘాతోపాటు కొరియర్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు.
సామాజికవేత్త, విశ్లేషకులు, 9949194327