మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మంగళవారం రాత్రి పట్టణంలోని శ్రీ బాలాజీ మందిర్లో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాండూర్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ జయప్రసాద్ హాజరయ్యారు కార్యక్రమంలో భాగంగా ముందుగా శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపాధ్యాయ దినోత్సవం లో  సెయింట్ మార్క్స్ స్కూల్ తో పాటు వివిధ పాఠశాలల నుంచి విరామం చెందిన ఉపాధ్యాయులు టీ. లార్దు రాజు, రాజం మరియా, పీఆర్ జసింతా, పి.అనంత్ రెడ్డి, శివరాజ్, ఉమాదేవిలను సన్మానించారు. అదేవిధంగా గ్రాడ్యూయేషన్ లో సత్తా చాటిన వినయ్ సార్డా(9.24 గ్రేడ్), సమీక్షా పర్తాని (9.19 గ్రేడ్), ఇంటర్ లో సత్తాచాటిన మాధవ్ అశ్వాహా(97.6 శాతం), ధృవ్ పర్తాని(93.83 శాతం), పదిలో ఉత్తీర్ణత సాధించిన దర్శన్ పర్తాని(89.16 శాతం), హితెన్ బూబ్ (87.5 శాతం), జయేష్ అగ్రవాల్ ( 85.6 శాతం)లను కూడా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా అథితులు మాట్లాడుతూ వైద్య, విద్యారంగంలో మార్వాడి యువమంచ్ చేస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్వాడి యువమంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్డా, రాజస్థాని ప్రగతి సమాజ్ అధ్యక్షులు రమేష్ చంద్ర సార్డా, మహిళ మండలి అధ్యక్షురాలు సంతోష్ రాఠి, మంచ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సన్ని అగ్రవాల్ తాండూరు అధ్యక్షులు బ్రిజ్ మోహన్ బూబ్, కార్యదర్శి కిషన్ రాఠి, కోశాధికారి అరుణ్ సార్డా, సభ్యులు అశిష్ సార్డా, పెద్దలు, సభ్యులు తదితరులుపాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page