ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 4 : ఎక్కువాయి పల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ శ్రీపాతి వీరారెడ్డి సేవలు చిరస్మరణీయమని రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి అన్నారు. సోమవారం ఎక్కవాయి పల్లి గ్రామంలో ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాటుచేసిన వీరారెడ్డి విగ్రహాన్ని సురేష్ రెడ్డి, మాజీ డిజిపి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డిలతో కలిసి ఆయన ఆవిష్కరించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువాయి పల్లి గ్రామం కోసం ఆయన సొంత భూమిని దానం చేసి ఆ భూమిలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విద్యాలయాలు, గ్రంధాలయాలు, నిర్మించి గ్రామం కోసం పాటుపడ్డారన్నారు. అనంతరం పరమ కర్మయోగి ధర్మదాత పుస్తకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, సర్పంచ్ సుగుణ సాయిలు, వీరారెడ్డి కుటుంబ సభ్యులు అహల్య దేవి, శ్రీ పాతి కరుణాకర్ రెడ్డి, శ్రీ పాతి నారాయణరెడ్డి, రామారెడ్డి, బట్టు నర్సిరెడ్డి, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి జంగం వెంకటేష్, నాయకులు మల్లేష్, శ్రీశైలం, చోటే, చంద్రయ్య, జెనిగల శ్రీను, వీరభద్రి, నరసింహ, సత్తయ్య, రాములు, నాయకులు పాల్గొన్నారు.