ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 25 : కల్వకుర్తి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం కడ్తాల్ మండలం, మైసిగండి గ్రామానికి చెందిన టిపిసిసి సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం గాంధీభవన్ లో కాంగ్రెస్ నాయకులతో కలిసి టీపీసీసీ ప్రతినిధి కి దరఖాస్తు ఫారాలను అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 2006లో మైసిగండి ఎంపిటిసి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, 2012లో ఉమ్మడి ఆమనగల్లు సింగల్ విండో చైర్మన్. 2014లో మైసిగండి ఎంపిటిసి సభ్యుడిగా రెండవ సారి ఏకగ్రీవంగా, 2014లో ఆమనగల్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 2017 నుంచి 2023 వరకు రెండుసార్లు పిసిసి సభ్యులుగా కొనసాగుతున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తనకు కల్వకుర్తి టికెట్ ఖరారు చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గం లో మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో నిబద్దత గల కాంగ్రెస్ నాయకుడి గా ఉంటూ సేవలందిస్తూ చురుకుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రజా రైతు సమస్యలపై పేదల ఇండ్ల కోసం, తండాల రోడ్ల కోసం, నీళ్ల కోసం ప్రజా సమస్యల పై శ్రీనివాస్ గౌడ్ అలుపెరుగని పోరాటాలు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం తాను పడుతున్న కష్టాన్ని పార్టీ గుర్తిస్తుందని శ్రీనివాస్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు, గత 30 సంవత్సరాలుగా పార్టీ క్రమశిక్షణ కలిగిన సైనికుడిలా పనిచేస్తున్నానని తెలిపారు, గత తొమ్మిది సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నానని తెలిపారు. కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం శ్రమిస్తున్న నాకు పార్టీ తప్పకుండా టికెట్ కేటాయిస్తుందని శ్రీనివాస్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన వెంట సీనియర్ నాయకులు జవహర్లాల్ నాయక్, జగన్, సురేందర్,తదితరులు ఉన్నారు.