హయత్ నగర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25 : ప్రతి ఒక్కరు మొక్కలను విరివిగా నాటి,వృక్ష సంపదను పెంపొందించి, ప్రకృతిని కాపాడాలని పెద్ద అంబర్ పెట్ వార్డ్ కౌన్సిలర్ దేవిడి గీత వేణుగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం హరితహారంలో భాగంగా శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి తట్టిఅన్నారం పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పెరుగుతున్న కాలుష్య నివారణ పచ్చని చెట్లతోనే సాధ్యమన్నారు. భవిష్యత్ తరాలకు పచ్చని చెట్లను అందించడం మనందరి బాధ్యత అన్నారు. పచ్చని చెట్లు – ప్రగతికి మెట్లు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రేయాస్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సాయి సత్యనారాయణ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆర్. రాగలతారెడ్డి, ఎన్ ఎస్ ఎస్ విద్యార్థి సమన్వయకర్తలు ఆర్ వి వి నిఖిల్, మాన్విత్, యూత్ కాంగ్రెస్ నాయకులు, విద్యార్థి బృందాలు తదితరులు పాల్గొన్నారు.