పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 15: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్షతోనే సాధ్యమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.పటాన్ చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో గ్రామస్తుడు ఎన్ఎంఆర్ యువసేన సభ్యుడు సార లక్ష్మణ్ జన్మదినం పురస్కరించుకుని ప్రతి ఏడాది గ్రామానికి ఏదో ఒకటి చేసే నేపథ్యంలో ఈ ఏడాది ఏర్పాటుచేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ చే ఆవిష్కరింప చేసి పూలమాల వేశారు.జన్మదినం అంటే వేడుక కాదు ఏదో గ్రామానికి చేయాలని ఎన్ఎంఆర్ యువసేన సభ్యుడు ముందుకు వచ్చి ప్రతీ ఏడాది ఏదో ఒకటి చేయటం గర్వించదగ్గ విషయమని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో యువత ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు రావడం మంచి విషయం అన్నారు. నియోజకవర్గంలో ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు ప్రజలకు అండగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇలాంటి వారికి ఎప్పుడూ తాను అండగా ఉంటానని ఆయన తెలిపారు.ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు తనను ముందుకు నడిపించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.నియోజవర్గ ప్రజల ఆశీస్సులతో ఎన్ఎంఆర్ యువసేన సభ్యుల కృషితో ప్రజలకు మంచి చేసే విధంగా ముందుకు నడుస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నరేష్ రెడ్డి,మల్లేష్,చిత్తరి,లక్ష్ మణ్,నాయకులు రమేష్,సత్యం,నిరంజన్,లక్ష్మి నారాయణ, నాగ భూషణం,బాల్రం,శ్రీశైలం,శ్రీహరి, రాజు,జంగిర్,భాస్కర్,సాయి,శేఖర్ ,రాజు, సత్యా నారాయణ, గ్రామ పెద్దలు, ప్రజలు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.