పరిగి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు.సోమవారం పరిగి పట్టణంలోని బృందావన్ గార్డెన్స్ లో పరిగి, పూడురు,దోమ, చౌడపుర్, కుల్కచర్ల మండలాలకు సంబంధించి లబ్ధిదారులకు బీసీ బందు చెక్కులను పంపిణీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ… బీసీల్లో వెనుకబడిన వర్గాలకు అభివృధ్ధి పెంచాలని కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకొని పథకo ప్రవేశపెట్టారు అని అన్నారు. ఒకప్పుడు గ్రామాలు ఎలా వుండేవి ఇపుడు ఎలా వుండేవి అని ఆలోచించాలి అని అన్నారు.పెన్షన్ 200 నుండి 2000 వరకు పెరిగిందన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక వ్యక్తి కెసిఅర్ అని,రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ఇలాంటివి మరెన్నో పథకాలను ప్రజల్లోకి తీసుకు వస్తారు అని అన్నారు.నియోజ వర్గం వారిగా 300 మందికి చెక్కులను అందించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో పరిగి ఎంపీపీ కరణం అరవింద రావు,జెడ్పీటీసీ హరిప్రియ ప్రవీణ్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్,పలువురు ప్రజా ప్రతినిధులు పలు గ్రామాల లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.