శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 14: శేరిలింగంపల్లి నియోజక వర్గం భారతి నగర్ లో జరిగిన బోనాల కార్యక్రమంలో ఫలహార బండిని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ మేరకు ఆయన సోమవారంతెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల సందర్భంగా భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎం ఐ జి కాలనీ లో గల లలిత పోచమ్మ దేవాలయం వద్ద మాజీ కౌన్సిలర్ శ్రీ మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి , రాగం నాగేందర్ యాదవ్ , శ్రీ జగదీశ్వర్ గౌడ్ లతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి ఫలహారం బండి ఊరేగింపుని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ విరేశం గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదర్శ్ రెడ్డి, మిర్యాల రాఘవరావు, బాలింగ్ గౌతమ్ గౌడ్ , జనార్ధన్ రెడ్డి, కర్ణాకర్ గౌడ్, సత్యనారాయణ ,శ్రీనివాస్ రాజు ,భాస్కర్, వెంకటేష్ గౌడ్,మల్లేష్ గౌడ్,నాగమణి, జ్యోతి మరియు తదితరులు పాల్గొన్నారు.