ఉప్పల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: మార్వాడీల సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషీ చేస్తుందని, మార్వాడి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. సోమవారంచిలుకనగర్ లో మాజీ కౌన్సిలర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య మార్వాడీ సోదరుల ఆహ్వానం మేరకు డివిజన్ లో ఏర్పాటు చేసిన మార్వాడీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా బండారి లక్ష్మారెడ్డి హాజరైనారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మార్వాడీల సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషీ చేస్తుంది అని తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఎల్లప్పుడు మీకు అండగా వుంటాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో అమిత్ భాయ్,అశోక్ కుమార్,దినేష్,అశోక్ లుమియ, దీప్ చాంద్, బహులల్ ,జనార్ధన్ గౌడ్,శంకర్ ,రమేశ్ ,తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.