ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 12 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గూడు లేని నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకానికి గడువును పెంచాలని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యుడు వస్పుల శ్రీశైలం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైన్స్ షాపు టెండర్లకు 15 రోజుల గడువు ఇచ్చి గృహలక్ష్మి పథకంకు దరఖాస్తు చేసుకునేందుకు మూడు రోజులే గడువు ఇవ్వడం పట్ల చాలామంది నిరుపేదలు ఇబ్బందులకు గురవుతున్నారనీ అన్నారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే రైతు రుణమాఫీ, బీసీ బంధు, మైనారిటీ బంధు, గృహలక్ష్మి వంటి పథకలను పెట్టి ప్రజలను అయ్యోమయం చేస్తున్నారని విమర్శించారు. పథకాల పేరుతో మరోసారి మోసం చేసి మూడోసారి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. సొంత స్థలం ఉంటే రూ. 5 లక్షలు ఇస్తామని చెప్పి 3 లక్షలకే కుదించి పేదలను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని వస్పుల శ్రీశైలం విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏక కాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ అర్హులైన అందరికీ ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తుందని అన్నారు.