ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

హయత్ నగర్ , ప్రజాతంత్ర, ఆగస్ట్ 12 : ఎల్బీనగర్ నియోజకవర్గం లో ఉన్న అన్ని ప్రధాన సమస్యల పరిష్కారానికి దశలవారీగా కృషి చేస్తానని ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం హయత్ నగర్ డివిజన్ పరిధి నందు పలు సమస్యలను ఎదుర్కొంటున్న సూర్య నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్,మిదాని కాలనీ,సీతారామపురం కాలనీ,డిఫెన్స్ కాలనీ,సూర్య తేజ కాలనీ,కమర్షియల్ టాక్స్ కాలనీ,ఆంధ్ర బ్యాంక్ కాలనీ,ఆర్టీసీ మజ్దూర్ కాలనీ,ఆనంద్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్,విద్యా నగర్ కాలనీవాసులచే కలిసి మిదాని కాలనీ కమ్యూనిటీ హాల్ నందు సమీక్ష సమావేశం నిర్వహించారు.దానిలో భాగంగా ముందుగా సూర్య నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల కోరిక మేరకు వారి యొక్క కాలనీ నందు పర్యటించారు.దానిలో భాగంగా సబ్ రోడ్లు నిర్మించాలని కోరారు.అనంతరం మిదాని కాలనీ నందు తిరిగి చుట్టుపక్కల కాలనీ అధ్యక్ష,కార్యవర్గ సభ్యులచే సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ …మీ యొక్క హయాంలోనే ప్రతి కాలనీలకు మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగింది అని తెలిపారు.అలాగే దాదాపుగా డ్రైన్స్ నిర్మాణం కూడా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.కొన్ని కొన్ని చోట్ల డ్రైన్స్ నిర్మాణం చేయాలని కోరారు.ప్రస్తుతం రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు.అలాగే కొన్ని కాలనీల యందు పార్కులు కబ్జాకు గురికాకుండా చూడాలని కోరారు.అలాగే మిదాని కాలనీ నందు ఉన్న పార్క్ స్థలంలో నర్సరీ ఎర్పాటు చేయడం జరిగిందని,దానిని మరొక్క చోటుకు తరలించి ఒక చిల్డ్రెన్ పార్క్ నిర్మాణం చేపట్టాలని కోరారు.అలాగే కొన్ని పార్కుల్లో గోడలు నిర్మించాలని సూచించారు.అలాగే కొన్ని పార్కులు రాత్రి పూట మందుబాబులకు అడ్డాగా మారడం జరిగింది అని తెలిపారు.రాత్రి పూట పెట్రోలింగ్ పెంచాలని కోరారు.అవసరం ఉన్న చోట్ల స్ట్రీట్ లైట్స్ ఎర్పాటు చేయాలని కోరారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ… నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు ముందుగా త్రాగునీరు,డ్రైన్స్ పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు.అనంతరం ప్రాధాన్యత క్రమంలో మిగతా పనులు చేయడం జరుగుతుంది అని తెలిపారు.అలాగే మిదాని కాలనీ నందు ఉన్న పార్క్ స్థలంలో నర్సరీ ఎర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.దానిని మరొక్క చోటుకు తరలించి రోబోయే తరాలకు చిన్నారులకు ఒక అద్భుతమైన చిల్డ్రెన్ పార్క్ నిర్మాణం చేపడుతాము అని హామీ ఇచ్చారు.పిల్లలకు చదువుతో పాటు ఆట,పాటలు కూడా ముఖ్యం అని తెలిపారు.అలాగే పార్కులు కబ్జా కాకుండా పార్కుల చుట్టూ ప్రహారిగొడలు నిర్మించి అట్టి ప్రభుత్వ స్థలాలు కాపాడుకుంటాము అని హామీ ఇచ్చారు.అలాగే పోలీస్ అధికారులచే మాట్లాడి పెట్రోలింగ్ ఎర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.అలాగే ప్రభుత్వ ఓపెన్ స్థలాలు కబ్జా కాకుండా మీరు కూడా మీ యొక్క సహాయ,సహకారాలు అందగించాలని సూచించారు.మీ యొక్క దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు నా దృష్టికి తీసుకొని రావాలని కోరారు.అలాగే మిగిలిపోయిన అన్ని కాలనీల నందు సబ్ రోడ్స్ పనులను అతి త్వరలోనే ప్రారంభిస్తాము అని హామీ ఇచ్చారు.నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరిగిందని తెలిపారు.ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి.వాటిని కూడా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని తెలిపారు.ఇట్టి నియోజకవర్గన్నీ అభివృద్ధి విషయంలో ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాడమే తన లక్ష్యం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి,సీనియర్ నాయకులు భాస్కర్ సాగర్,మల్లేష్ ముదిరాజ్,కృష్ణ రెడ్డి,స్కైలాబ్ మరియు వివిధ కాలనీ అధ్యక్ష,కార్యవర్గ సభ్యులు,నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page