రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం

పరిగి ప్రజాతంత్ర,ఆగస్ట్ 11: తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుందని,రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం అయిందని ఏఐసీసీ కార్యదర్శి, కేరళ రాష్ట్ర ఎమ్మెల్యే పీసీ  విష్ణునాథ్ అన్నారు.శుక్రవారం పరిగి మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు  రామ్మోహన్ రెడ్డి నివాసంలో ఏఐసీసీ కార్యదర్శి పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం మండల అధ్యక్షులతో కలసి నిర్వహించారు.సమావేశంలో  గంగమండలాల్లో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి మాట్లాడుతూ….తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ అరాచక పాలన కొనసాగిస్తుంది అని, ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం అయింది అని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం చేసిన అవినీతి కంటే ఎక్కువ బిఆర్ఎస్ పార్టీ అవినీతి చేసిందని అన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో బిఆర్ఎస్ ప్రభుత్వం కొత్త కొత్త పథకాలు తెచ్చి ప్రజలను మభ్య పెడుతుందనీ, కర్నాటక రాష్ట్రంలో వలే తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. భూత్ స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్స్ కార్యకర్త పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.రాహుల్ గాంధీ ని స్ఫూర్తిగా తీసుకొని పోరాట పటిమను చూపించి కష్టపడాలి అని సూచించారు. వరంగల్ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, కాంగ్రెస్ పార్టీ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రభుత్వ వైఫాల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పరిగి నియోజకవర్గ స్థాయిలో అన్ని కమిటీలు పూర్తి చేసుకొని ఆదర్శ నియోజక వర్గంగా నిలిచిందని అన్నారు. పరిగి నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ రోల్ మోడల్ గా తీసుకుంటుందని తెలిపారు.వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అన్ని స్థానాల్లో గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ కార్యకర్తలు,నాయకులు నిర్భయంగా ప్రభుత్వం పై పోరాటం చేస్తు ఎన్ని కేసులు పెట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పనిచేస్తున్నందుకు  ధన్యవాదాలు  తెలిపారు. అనంతరం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ… అధిష్టానం ఆదేశాల మేరకు అన్ని సలహాలు సూచనలు పాటిస్తూ  వికారాబాద్ జిల్లాలో అన్ని స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని, కార్యకర్తలకు అండగా తాను ఎల్లపుడూ ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ రాములు , జిల్లా ఉపాధ్యక్షులు భీమ్ రెడ్డి, లాల్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, అశోక్, జిల్లా ఎస్సీ, బీసీ, యుత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యుఐ, మహిళా కాంగ్రెస్, అద్యక్షులు అదేవిధంగా నియోజక వర్గ మండలాల అద్యక్షులు ఎర్రగడ్డ పల్లీ కృష్ణ, మండల అధ్యక్షులు పరశురాం రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, సురేందర్ ముదిరాజ్, నారాయణ, నర్సింహ రావు, ఆంజనేయులు, అశోక్ కుమార్, నరేందర్ యాదవ్, సతీష్ రెడ్డి, సర్పంచ్ జితేందర్ రెడ్డి, పులిందర్ రెడ్డి, అశోక్ రెడ్డి, సురేఖ రెడ్డి,  కౌన్సిలర్స్ శ్రీను, తోర్య నాయక్, అంజిలయ్య ,షహీద్, యేజాస్, మల్లేష్, జమీల్ జగన్, యువజన ఎంపిటిసి, సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు జగన్, మీర్జా, రామకృష్ణా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఆరిఫ్, అఖిల్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page