జీవ ఇంధనం వాడుదాం.. జీవుల మనుగడకు సహకరిద్ధాం

వాహనాల్లో ఇంధనంగా పెట్రోల్‌ లేదా డీజిల్‌ను, విద్యుత్‌ తయారీలో బొగ్గు లేదా అణుశక్తిని వాడుతున్నాం. ఇవన్నీ పరిమితమైన వనరులు మాత్రమే గాక వాతావరణ కాలుష్య కారకాలు కూడాను. అందువల్ల వీటికి ప్రత్యామ్నాయం జీవ ఇంధనాలను వాడవచ్చు. సాంప్రదాయ శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా సాంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆగస్ట్‌ 9, 1893న, సర్‌ రుడాల్ఫ్‌ డీజిల్‌ వేరుశెనగ నూనెతో మెకానికల్‌ ఇంజిన్ను నడిపించాడు. తరువాతి శతాబ్దంలో శిలాజ ఇంధనాల స్థానంలో కూరగాయల నూనె వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాడు. ఆయన గౌరవార్థం ఆగస్ట్‌ 10వ తేదీను ప్రపంచ జీవ ఇంధన దినోత్సవ వేడుకగా ఎంచుకున్నారు.
మనం నివసిస్తున్న ఈ భూమి మీద కాలుష్యాన్ని తగ్గించడానికి స్థిరమైన అభివృద్ధి కోసం సంప్రదాయేతర ఇంధన వనరులను ఉపయోగించడాన్ని ఈ రోజు ప్రోత్సహిస్తుంది. ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని పెట్రోలియండసహజ వాయువు మంత్రిత్వశాఖ 2015 నుండి పాటిస్తోంది. జీవ ఇంధనాలు వ్యవసాయ వ్యర్థాలు, పంటలు, చెట్లు లేదా గడ్డి వంటి జీవ పదార్థాల నుండి ఉత్పన్నమయ్యే శక్తి యొక్క పునరుత్పాదక వనరులు. సాంప్రదాయ శిలాజ ఇంధనాలతో పోలిస్తే ఇవి తక్కువ కార్బన్‌ మోనాక్సైడ్‌, విషపూరిత ఉద్గారాలను విడుదల చేయడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడమేగాక ముడి చమురుపై దిగుమతి ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. జీవ ఇంధనం పర్యావరణానికి అనుకూలమైనది. ఇవి ప్రస్తుతం వాడుతున్న ఇందనాల కంటే 86 శాతం వరకు తక్కువ గ్రీన్‌ హౌస్‌ వాయువులను, 47 శాతం తక్కువ రేణువులను ఉత్పత్తి చేస్తాయి. ప్రస్తుతం ప్రపంచ రవాణాలో వీటి వాటా 3 శాతంగా ఉంది. 2050 సంవత్సరం నాటికి వీటి వాటా 25 శాతంగా ఉండాలని పారీస్‌ లో ఉన్న అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐ.ఇ.ఎ) అన్ని దేశాలకు సూచింది. చెరకు, చక్కెర దుంపలు, తీపి జొన్నలు మొదలైన చక్కెర కలిగిన పదార్ధాల వంటి బయోమాస్‌ నుండి ఉత్పత్తి చేయబడిన ఇథనాల్‌, తినదగిన కూరగాయల నూనెలు, యాసిడ్‌ నూనె, ఉపయోగించిన వంట నూనె లేదా జంతువుల కొవ్వు, బయో-ఆయిల్‌ నుండి ఉత్పత్తి చేయబడిన కొవ్వు ఆమ్లాల మిథైల్‌ లేదా ఇథైల్‌ ఈస్టర్‌ వంటి బయో డీజిల్‌, వ్యవసాయ, అటవీ అవశేషాలు అనగా వరి డ గోధుమ గడ్డి,మొక్కజొన్న కాబ్లుడ స్టవర్‌, బాగాస్సే, వుడీ బయోమాస్‌, ఆహారేతర పంటలు అనగా గడ్డి, ఆల్గే లేదా పారిశ్రామిక వ్యర్థాలు మరియు అవశేషాల ప్రవాహాల నుండి తయారయ్యే ఇంధనాలు, డ్రాప్‌-ఇన్‌ ఇంధనాలు, బయో-సి. యన్‌.జి వంటి వాటిని జీవ ఇందనాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. 2018లో స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (గ్రామిన్‌) కింద గోబార్‌ (గాల్వనైజింగ్‌ ఆర్గానిక్‌ బయో-అగ్రో రిసోర్సెస్‌) పథకం ప్రారంభించబడిరది. వ్యాపార వెంచర్ల అభివృద్ధికి పర్యావరణాన్ని పెంపొందించడం, 2జి ఇథనాల్‌లో పరిశోధన, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ప్రధాన్‌ మంత్రి జీవన్‌ యోజన 2019, ఉపయోగించిన వంట నూనెను సేకరించి బయోడీజిల్గా మార్చే పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ( యఫ్‌.ఎస్‌.ఎస్‌.ఎ.ఐ) ద్వారా రీపర్పస్‌ యూజ్డ్‌ కుకింగ్‌ ఆయిల్‌ కార్యక్రమం ప్రారంభించబడిరది. బయోఇథనాల్ను ఉత్పత్తి చేయడానికి మిగులు ఆహార ధాన్యాలు, బయోమాస్ను ఉపయోగించుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతించింది. ఇంకా 2013-14 ఇథనాల్‌ సరఫరా సంవత్సరంలో భారతదేశం యొక్క ఇథనాల్‌ సామర్థ్యం 1.53% నుండి 2020-21లో 7.93%కి పెరిగినట్లు నివేదించబడిరది. 2013-14లో 38 కోట్ల లీటర్లు ఉన్న ఇథనాల్‌ సరఫరా 2020-21లో 322 కోట్ల లీటర్లకు పెరిగింది. అదేవిధంగా, ఇథనాల్‌ బ్లెండిరగ్‌ శాతం కూడా 2013-14లో 1.53% నుండి 2020-21లో 8.50%కి పెరుగుతుందని అంచనా. డిమాండ్‌ పెరుగుదల కారణంగా, ఇథనాల్‌ స్వేదనం సామర్థ్యం కూడా 215 కోట్ల లీటర్ల నుండి ఏటా 427 కోట్ల లీటర్లకు రెట్టింపు అయింది. 2014-15లో 157 ఉన్న డిస్టిలరీల సంఖ్య 5 సంవత్సరాలలో 40% పెరిగి 2019-20లో 231కి చేరుకుంది. దేశంలో బయో-డీజిల్‌ మిశ్రమం 2001లో పైలట్‌ ప్రాతిపదికన ప్రారంభమైంది. ప్రభుత్వం జూన్‌ 2018లో జీవ ఇంధనాలపై జాతీయ విధానాన్ని ఆమోదించింది-2018. ఈ పాలసీ లక్ష్యం 2030 నాటికి 20% ఇథనాల్‌-బ్లెండిరగ్‌ మరియు 5% బయోడీజిల్‌-బ్లెండిరగ్కు చేరుకోవడం. ఇతర విషయాలతోపాటు, ఈ విధానం ఇథనాల్‌ కోసం ఫీడ్స్టాక్‌ పరిధిని విస్తరిస్తుంది. ఉత్పత్తి, అధునాతన జీవ ఇంధనాల ఉత్పత్తికి ప్రోత్సాహకాలను అందించింది. జీవ ఇంధనాల రంగం పురోగతి కారణంగా ఈ విధానం మే 2022లో సవరించబడిరది. మనమందరం జీవ ఇంధనాలను వాడుదాం. జీవుల మనుగడకు సహకరిద్ధాం.

-డి.జె మోహనరావు
యం.ఎస్సీ(ఫిజిక్స్‌) టీచర్‌,
ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా,
ఆంధ్రప్రదేశ్‌, 9440485824

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page