ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 08 : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో యామిని స్టూడియోస్ ప్రారంభోత్సవం సందర్భంగా స్వరరాగ నీరాజనం, గాయని గాయకులకు డాక్టర్ సినారె అవార్డుల ప్రధానోత్సవం వేడుకలో భాగంగా సెప్టెంబర్ 10 న రవీంద్రభారతిలో ప్రముఖ సంఘ సేవకుడు విశ్వజనని ఫౌండేషన్ ఫౌండర్, చైర్మన్ బొగ్గారపు బ్రహ్మానందం కి డాక్టర్ సినారె ప్రత్యేక బిరుదు ప్రధానాన్నీ తెలంగాణ శాసనమండలి సభ్యులు, ఉపసభాపతి బండా ప్రకాష్ ముదిరాజ్ అందజేయనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ సముద్రాల వేణుగోపాల చారి, ప్రత్యేక అతిధి ప్లే బ్యాక్ సింగర్-అడ్వైజర్ ప్రణయ్ కుమార్ నీరటి, యామిని స్టూడియోస్ అధ్యక్షురాలు గాయని యామిని తదితర ప్రముఖులు, అతిరథ మహారధుల చేతుల మీదుగా సినారె లాంటి గొప్ప మహానుభావుడి బిరుదును అందుకోబోతున్న సందర్బంగా బొగ్గారపు బ్రహ్మానందం హర్షం వ్యక్తం చేశారు.