కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 8 : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయల పింఛను అందిస్తామని కందుకూరు మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దంతోజి నరసింహ చారి తెలిపారు.మంగళవారం బాచుపల్లి,పులిమామిడి గ్రామాల్లో యూత్ డిక్లరేషన్ కార్యక్రమంలో భాగంగా డోర్ టు డోర్ తిరిగి ఆయన ప్రజలతో ముచ్చటించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన విషయాలు వివరంగా తెలియజేశారు.నేడు కొనసాగుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ధనిక రాష్ట్రమున్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆయన ఆరోపించారు.తెలంగాణ వచ్చాక కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడిందని,పేద ప్రజలు ఎలాంటి బాగోగులు పడలేదని ఆయన తెలిపారు. నేటి ప్రభుత్వంలో కులాల వారీగా విభజిస్తూ పాలన కొనసాగిస్తున్నారని ఇది రాచరిక పాలనకు సంకేతాలు ఇస్తున్నాయని ఆయన తెలిపారు.రానున్న ఎన్నికల్లో తిరిగి టిఆర్ఎస్ కు ఓటు వేస్తే ప్రజలు ఆగమైతారని ఆయన పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ప్రజలకు మరింత సేవ చేయడానికి తమ వంతుగా కృషి చేస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షుడు మద్దెల శ్రీశైలం,యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తుల వెంకటేష్, బుక్క పాండురంగారెడ్డి,మహేందర్ రెడ్డి, అలువాల బిక్షపతి,ఆంజనేయులు చారి, ఎండి.యూసఫ్,పెద్దబాబు,రేవెల్ల ప్రభుదాస్, బుక్క శ్రీనివాస్ రెడ్డి,నవీన్ గౌడ్,కృష్ణ కుమార్,రాఘవేందర్, ముత్యాల,ఇస్తారి,యాదయ్య,విజయ్, రామకృష్ణ,రాజు,ఎండి సయ్యద్ బాబా బుడోని మల్లేష్,ఊటు రాజు తదితరులు పాల్గొన్నారు.