గీతంలో అంతర్జాతీయ సదస్సు 

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 8: గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 11-13 తేదీలలో ఘనీభవించిన పదార్థ భౌతిక శాస్త్రంలో పురోగతి అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నట్టు మంగళవారం వెల్లడించారు. ఆధునిక ఘనీభవించిన పదార్థ భౌతిక శాస్త్రంలో ముఖ్యమైన, తాజా పరిణామాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులు ఒకరికొకరు తెలియజేసుకునే క్రియాశీల వేదికను అందించడం, ప్రస్తుత పరిశోధనలోని ఆసక్తికర అంశాలు, వినూత్న ఆలోచనలను పరస్పరం మార్పిడి చేసుకోవడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఘనీభవించిన పదార్థ పరిశోధనలో భవిష్యత్తు పోకడలపై దృక్పథాన్ని అందిస్తుందని, సంభావ్య సహకారాన్ని పెంపొందించే అవకాశాలను శోధించేలా ఈ సదస్సు ప్రేరేపిస్తుందన్నారు. అనుభవజ్ఞుల స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు ఉంటాయని, యువ శాస్త్రవేత్తల గోడ పత్రికల ప్రదర్శన (పోస్టర్ ప్రెజెంటేషన్) కూడా ఉంటుందని తెలిపారు. ఈ సదస్సులో పత్ర సమర్పణ ఆగస్టు 25వ తేదీలోగా చేయొచ్చని, నాణ్యమైన పరిశోధనా పత్రాలను ఎంపిక చేసి క్షుణ్ణంగా సమీక్షించిన ప్రొసీడింగ్లలో ప్రచురిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు https://forms.gle/sJkeDxwwpUjfsoCk9 లింక్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పారు. ఇతర వివరాల కోసం సదస్సు నిర్వాహకుడు డాక్టర్ ఐవీ సుబ్బారెడ్డి 96181 77690ని సంప్రదించాలని, icacmp 2023@gitam.eduకు ఈ-మెయిల్ చేయాలని, లేదా www.gitam.edu/ICACMP2023 ని సందర్శించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page