దేశంలో భారత రాజ్యాంగం ద్వారానే   ప్రజలందరికీ సమాన హక్కు

  ఉప్పల్,ప్రజాతంత్ర,ఆగస్ట్ 7:  భారత రాజ్యాంగము అమలులోకి వచ్చిన తర్వాతనే భారతదేశంలో ప్రజలందరికీ సమాన హక్కులు వచ్చాయని అంతకుముందు వర్ణ కుల ఆధారంగానే న్యాయం జరిగేదని అందుకే బాబా సాహెబ్ అంబేద్కర్ ను భారతదేశ సమతా మూర్తిగా అన్ని వర్గాల ప్రజలు కొనియాడుతారని తెలంగాణ తొలి మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్య అన్నారు. సోమవారం డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా ఉస్మానియా మరియు తెలంగాణ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ అధ్యక్షతన ఆగస్టు 7 నుండి 90 వరకు జరిగే 75 సంవత్సరాల భారత రాజ్యాంగము అనుభవాలు భారత ప్రజల భవిష్యత్తు అనే అంశంపై జరిగిన ప్రారంభ జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పై అంశంపై ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఎడిట్ చేసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం భారత రాజ్యాంగం ద్వారా పరిష్కరించవచ్చని కానీ పాలకులకు చిత్తశుద్ధి లేని కారణంగా గత 75 సంవత్సరాలుగా భారత రాజ్యాంగ లక్ష్యాలు 10 శాతం కూడా నెరవేరలేదని అందుకే భారతదేశ వెనకబడి ఉందని ఆయన అన్నారు సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం ఎంత గొప్పదైన పాలకులు చెడ్డవారైనప్పుడు రాజ్యాంగం ఫలాలు కూడా చెడ్డవి అవుతాయని అది రాజ్యాంగం తప్పు కాదని పాలకుల తప్పు మాత్రమేనని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ నవంబర్ 25 1949 నిండు రాజ్యాంగ సభలో ప్రసంగిస్తూ నేటి నుండి రాజ్యాంగం పరంగా అందరం సమానమే సమాజపరంగా కుల మత ప్రాంత ఇలా అనేక రకాల అసమానతలు వీర సంవత్సరాలుగా కొనసాగుతున్నాయని వాటిని రూపుమాపణమే పాలకుల యొక్క కర్తవ్యం అని అది రాజ్యాంగం అమలు తోని సాధ్యమని గత 75 సంవత్సరాలుగా ఆయన ఆశించిన ఆశయాలు నెరవేరలేదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ కౌన్సిలర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి యు జి సి డి ప్రొఫెసర్ జి మల్లేశం సీనియర్ ప్రొఫెసర్ జిబి రెడ్డి డిపార్ట్మెంట్ ఆఫ్ లా ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు అతిథులుగా పాల్గొనగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నితిన్ మిశ్రమం కీలక ప్రసంగం చేశారు ఈ కార్యక్రమంలో 50 కి పైగా విశ్వవిద్యాలయాలు ఉపాధ్యాయులు పరిశోధక 75 పరిశోధన పత్రాలు సమర్పించగా 55 పరిశోధక పత్రాలను పుస్తక రూపంలో ప్రచురించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page