ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 5 : ఆమనగల్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్లో 16 మద్యం దుకాణాలకు టెండర్లు పిలుస్తున్నామని ఆమనగల్ ఎక్సైజ్ సీఐ బద్య నాయక్ చౌహన్ నేడు ఓ ప్రకటనలో తెలిపారు. ఆమనగల్ ఎక్సైజ్ సర్కిల్ లోని నాలుగు మండలాలలో 16 దుకాణాలకు దరఖాస్తుల ను స్వీకరిస్తున్నామన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీలో 6, కడ్తాల మండలానికి 4, తలకొండపల్లి మండలానికి 3, మాడుగుల మండలానికి 3, దుకాణాలు కేటాయించడం జరిగిందన్నారు. రిజర్వేషన్ల ప్రకారం జనరల్ కు 7, గౌడ కులస్తులకు 7, ఎస్టీలకు 1, ఎస్టీలకు 1, చొప్పున అలాట్ చేసినట్లు ఆయన వివరించారు. జనాభా ప్రాతిపదికన 15 దుకాణాలకు రూ. 55 లక్షల చొప్పున లైసెన్స్ ఫీజును సంవత్సరానికి కేటాయించినట్లు పేర్కొన్నారు. మాడుగుల మండలం కొలుకుల పల్లి దుకాణానికి రూ. 50 లక్షలు కేటాయించడం జరిగిందన్నారు. హైదరాబాద్ లోని బండ్లగూడ ఎక్సైజ్ అకాడమీలో ఈనెల 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆయన వెంట ఎస్సైలు శ్రీనివాస్, యాదయ్య, స్వప్నలు ఉన్నారు.