– ఆగస్టు 11 నుంచి రెండో విడత ఓటు చైతన్య యాత్ర.
– తెలంగాణ ఉద్యమకారుడు పోరాటాల రామన్న
పరిగి, ప్రజాతంత్ర, జూలై 13: ప్రతి ఒక్కరిలో ఓటు చైతన్యం రావాలని అలా జరిగినప్పుడు మాత్రమే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారతాయని తెలంగాణ ఉద్యమకారుడు పోరాటాల రామన్న అన్నారు. గురువారం ఒక ఆయన విలేకరులతో మాట్లాడుతూ…. పార్టీలు జెండాలు ముఖ్యం కాదని, ప్రజల ఎజెండా నే ముఖ్యమని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తప్ప సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. పరిగి నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిపోయిందని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అదేవిధంగా చదువుకున్న యువకులకు ఉద్యోగాలు లేక నిరుద్యోగ వ్యవస్థ పెరిగిపోయిందని అన్నారు. దీనికంతటికి పరిగి ప్రాంత పాలకులే కారణమని మండిపడ్డారు. వారి సొంత లాభం తప్ప ప్రజల గురించి పట్టించుకునే నాధుడే లేరని అన్నారు. కనీసం ఇప్పటికైనా ప్రజలు ఓటు విలువ తెలుసుకోవాలని ఓటును అమ్ముకుంటే మన బతుకులు ఎప్పటికీ మారవని అన్నారు. ఆగస్టు 11వ తేదీ నుండి గ్రామాల్లో రెండో విడత ఓటు చైతన్య యాత్రను చేపడతామని ఈ యాత్రకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.