దేశానికి దిశా నిర్దేశం …

  • పదేళ తెలంగాణలో అద్భుత ప్రగతి
  • ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతూ ముందుకు
  • త్వరలోనే ఆసిఫాబాద్‌ ‌కలెక్టరేట్‌ ‌ప్రారంభిస్తాం
  • మంచిర్యాల కలెక్టరేట్‌ ‌ప్రారంభోత్సవంలో సీఎం కెసిఆర్‌

మంచిర్యాల,ప్రజాతంత్ర,జూన్‌9: ‌పసికూన అయిన పది సంవత్సరాల తెలంగాణ.. అద్భుతమైన ప్రగతికి నిదర్శనంగా నిలిచిందని, మిగతా రాష్టాల్రతో పోటీ పడుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న తెలంగాణ.. కేంద్రం నుంచి అనేక అవార్డులను అందుకుందని కేసీఆర్‌ ‌తెలిపారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌ ‌ప్రారంభించుకున్న అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి కేసీఆర్‌ ‌ప్రసంగించారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌ ‌ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని కెసిఆర్‌ ‌తెలిపారు. మనందరం చేసిన పోరాటంతో తెలంగాణ సాధించుకున్నాం. పరిపాలన సంస్కరణల కోసం నూతన కలెక్టరేట్‌లను నిర్మించుకున్నాం. సంస్కరణ అనేది నిరంతర పక్రియ. మంచిర్యాల జిల్లా డిమాండ్‌ ఎప్పట్నుంచో ఉంది.

తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కాబట్టే మంచిర్యాలను జిల్లాగా ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.  ప్రజలకు మంచి జరగాలనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ఆసిఫాబాద్‌ ‌కలెక్టరేట్‌ను కూడా త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాం. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ టాప్‌లో ఉందన్నారు. ప్రజలకు వారధిగా ఉద్యోగులు పని చేయడంతో, మంచి ఫలితాలను సాధించాం. తెలంగాణ ఎన్నో విషయాల్లో నంబర్‌ ‌వన్‌గా ఉంది. అనేక రికార్డులను నెలకొల్పాం. కరోనా, నోట్ల రద్దు ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి. కష్టకాలంలోనూ తెలంగాణ అభివృద్ధిలో ముందుందని గుర్తు చేశారు.  కులమతాలకు అతీతంగా అందరి సంక్షేమానికి కృషి చేస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేస్తున్న అధికారులకు అభినందనలు. కులవృత్తులకు ఆర్థిక సాయం పథకాన్ని, రెండో విడుత గొర్రెల పంపిణీ పథకాన్ని మంచిర్యాల నుంచే ప్రారంభించుకోబోతున్నాం. గొర్రెల పెంపకంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు.  మానవీయ కోణంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఆరోగ్య శాఖ బ్రహ్మాండమైన పురోగతి సాధించింది. మాతాశిశు మరణాలు తగ్గాయి.

కంటి వెలుగు లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ఢిల్లీ, పంజాబ్‌లో కూడా ఆ ముఖ్యమంత్రులు కూడా అమలు చేశారని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు పథకాలను ప్రారంభించింది. నూతన పథకాలైన గృహలక్ష్మి, కులవృత్తులకు ఆర్థిక సాయం పథకాలతో పాటు రెండో విడత గొర్రెల పంపిణీ పథకాన్ని మంచిర్యాల జిల్లా వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రారంభించారు.  సందర్భంగా గృహలక్ష్మి, బీసీ కులాల్లోని కులవృత్తుల లబ్దిదారులకు కేసీఆర్‌ ఆర్థిక సాయాన్ని అందించారు. రెండో విడుత గొర్రెల పంపిణీ కింద లబ్దిదారులకు కేసీఆర్‌ ‌గొర్రెలను పంపిణీ చేశారు. గృహలక్ష్మి, కులవృత్తుల వారు, గొర్రెల లబ్దిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్‌ ‌రెడ్డి, ఇంద్రకరణ్‌ ‌రెడ్డి, గంగుల కమలాకర్‌, ఎం‌పీ వెంకటేశ్‌ ‌నేత, ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, ‌దుర్గం చెన్నయ్య, జోగు రామన్న, దివాకర్‌ ‌రావు, రేఖా నాయక్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అందుబాటులోకి మంచిర్యాల సకృత కలెక్టరేట్‌
‌మంత్రుల సమక్షంలో ప్రారంభించిన సిఎం కెసిఆర్‌
‌బిఆర్‌ఎస్‌ ‌కార్యాలయానికి ప్రారంభోత్సవం

మంచిర్యాల,ప్రజాతంత్ర,జూన్‌9:  ‌మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సకృత జిల్లా కార్యాలయాల సముదాయంను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ ‌శిలాఫలకాన్ని కేసీఆర్‌ ఆవిష్కరించారు. నూతన కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కేసీఆర్‌ ‌పాల్గొన్నారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనాన్ని కేసీఆర్‌ ‌స్వీకరించారు. రూ.1,748 కోట్లతో చెన్నూర్‌, ‌పర్దాన్‌పల్లి లిప్ట్ ఇరిగేషన్‌ ‌పథకాలకు, రూ.510 కోట్లతో మెడికల్‌ ‌కాలేజీ, రూ.500 కోట్లతో మందమర్రి దగ్గర ఏర్పాటు చేయనున్న ఆయిల్‌ ‌పాం ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు, గోదావరిపై రూ.164 కోట్లతో నిర్మించే మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జికి కేసీఆర్‌ ‌శంకుస్థాపన చేశారు. కలెక్టరేట్‌ ‌ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మంత్రులు ప్రశాంత్‌ ‌రెడ్డి, ఇంద్రకరణ్‌ ‌రెడ్డి, గంగుల కమలాకర్‌, ఎం‌పీ వెం కటేశ్‌ ‌నేత, ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, ‌దివాకర్‌ ‌రావు, దుర్గం చిన్నయ్య, జోగు రామన్న, రేఖా నాయక్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొ న్నారు.

అలాగే మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆఫీసును ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రారంభించారు. ఆఫీసు ప్రారంభోత్స వానికి ముందు ఆ ఆవరణలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్‌ ‌కట్‌ ‌చేసి, కార్యాలయంలోకి సీఎం కేసీఆర్‌ ‌ప్రవేశించారు. ఈ పార్టీ కార్యాలయాన్ని రూ. 60 లక్షలతో నిర్మిం చారు. పార్టీ ఆఫీసు వద్దకు చేరుకున్న కేసీఆర్‌కు మంచిర్యాల జిల్లా టీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌ ‌రెడ్డి, ప్రశాంత్‌ ‌రెడ్డి, ఎంపీ వెంకటేశ్‌ ‌నేత, ఎమ్మెల్యే బాల్క సుమన్‌, ‌దుర్గం చిన్నయ్య, దివాకర్‌ ‌రావు, జోగు రామన్న, రేఖా నాయక్‌తో పాటు పలు వురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page