సంకల్పం గొప్పదైతే విజయం మీవెంటే..!

మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ ‌వి. లక్ష్మీ కాంతరావు
సామాజిక మాధ్యమాల మోజులో పడొద్దు..: జిల్లా ఆర్‌ ‌వీ కర్ణన్‌ ‌విద్యార్థులకు సూచన
సింగాపూర్‌ ‌గ్రామం కిట్స్ ‌కళాశాల సిల్వర్‌ ‌జూబ్లి ఉత్సవాలు

కరీంనగర్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 9: ‌మనం చేసే పని  ఏదైనా సంకల్పం గొప్పదైతే మనం అనుకున్న విజయం మనల్ని వెతుక్కుంటూ దానంతట అదే మన వద్దకు చేరుకుంటుందని మాజీ  రాజ్యసభ సభ్యులు   కెప్టెన్‌  ‌వి. లక్ష్మీ కాంతరావు  అన్నారు. శుక్రవారం హుజురాబాద్‌ ‌మండలం  సింగాపూర్‌ ‌గ్రామంలోని కిట్స్ ‌కళాశాల సిల్వర్‌ ‌జూబ్లి ఉత్సవ  కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌  ‌వి. లక్ష్మీ కాంతరావు ముఖ్య అతిధిగా పాల్గోన్నారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కళాశాలను ప్రారంభించే కొత్తలో గ్రామంలో కాకుండా ఎదైన పెద్ద నగరంలో ప్రారంభించాలని లేకపోతే నష్టపోతారని ఎంతో మంది తనను నిరాశపరిచారని,  కాని ఎటువంటి అవరోధాలు ఎదురైన సరే ఇదే గ్రామంలో కళాశాలను ప్రారంభించాలని దృఢంగా సంకల్పించుకొని కళాశాలను ప్రారంభించుకొని ఎంతోమంది విద్యార్థులు గోప్ప స్థానాలు చేరుకోవడానికి మార్గనిర్దేశంగా కళాశాల నిలిచేలా చేయగలిగానని  తెలిపారు.  నేటి విద్యార్థులు పోటి ప్రపంచానికి తగ్గట్టుగా సాంకేతికంగా అన్ని రకాల వసతులను కల్పిస్తూ, రేపటి బంగారు భవిష్యత్తుకు తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తుందని, దానికి తగట్గుగా విద్యార్థులు వారివారి నైపుణ్యాలను మెరుగుపరుచుకొవాలని పిలుపునిచ్చారు.

జిల్లా కలెక్టర్‌ ఆర్‌.‌వి. కర్ణన్‌ ‌మాట్లాడుతూ,  నేటి యువత ట్విట్టర్‌, ‌ఫేస్‌ ‌బుక్‌, ‌స్నాప్‌ ‌చాట్‌ ‌వంటి సామాజిక మాధ్యమాలపై ఎక్కువగా ఆధారపడుతు తిరిగి సంపాదించలేని సమయాన్ని కోల్పోతున్నారని,  కళాశాల చదువు పూర్తయిన తరువాత,   పై చదువులని, ఇతర పోటి పరీక్షలంటు ఇంట్లోనే కూర్చోని విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని అన్నారు.  చిన్న తనం నుండి ఇంజనీరింగ్‌ ‌పూర్తయ్యే వరకు ప్రతి విషయంలో తల్లి తండ్రులపైనే ఆధారపడ్డామని, ఇంజనీరింగ్‌ ‌పూర్తయిందంటే ఆర్థికంగా ఎదగాలని, అందుకు చిన్నదైన ఫరవాలేదు ఎదైన ఒక్క ఉద్యొగాన్ని సంపాదించుకోవాలని అన్నారు.   కార్యక్రమంలో చివరగా కళాశాలలో బాగా చదువుతూ ప్రతిభను కనబరిచిన పలువురు విద్యార్థులను, వారి తల్లితండ్రులను మరియు లెక్చరర్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్‌ ‌జి.వి.  రామకృష్ణారావు,  హుస్నాబాద్‌ ఎమ్మేల్యే వొడితల సతీష్‌ ‌కుమార్‌, ‌కళాశాల డైరెక్టర్‌ ‌లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page