పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు
హైదరాబాద్, ఏప్రిల్ 5(ఆర్‌ఎన్‌ఎ) : బండి సంజయ్ అక్రమ అరెస్టుపై బీజేపీ లీగల్ సెల్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. దీనిపై గురువారం విచారణ జరుపుతామని పేర్కొంది. హౌస్ మోషన్ విచారణకు న్యాయస్థానం నిరాకరించి, రెగ్యులర్ విచారణ జరుపుతామని వెల్లడించింది. ఈ పిటిషన్లో మొత్తం ఆరుగురిని ప్రతివాదులుగా చేర్చింది. హోమ్ శాఖ కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్, రాచకొండ పోలీసు కమిషనర్లు, బొమ్మలరామారం సీఐలను ప్రతివాదులుగా చేర్చుతూ పిటిషన్ దాఖలు చేసింది. బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేశారని..అరెస్టు సమయంలో కనీస నిబంధనలను పాటించలేదని అందులో పేర్కొన్నది. సీఆర్పీసీ 41సీ ప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం కుదరదని, వెంటనే సంజయ్‌ను విడుదల చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో కోరింది.