చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉండాలి…

తీన్మార్ మల్లన్న ,తెలంగాణ విఠల్ అరెస్ట్ ను ఖండిస్తూ మానవ హక్కుల వేదిక ప్రకటన విడుదల
రాచ కొండ పోలీసు కమిషనరేట్ ఫరిధిలోని ,మేడిపల్లి పోలీసులు తీన్మార్ మల్లన్న అలియాస్ సీహెచ్ .నవీన్ కుమార్ ,ఫ్రీలాన్స్ విలేఖరి తెలంగాణ విఠల్ ను   అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ మానవ హక్కుల వేదిక బుధవారం ప్రకటన విడుదల చేసింది మల్లన నిర్వహిస్తున్న స్వతంత్ర   యూ ట్యూబ్ ఆఫీస్ పై రెండు రోజుల క్రితం జరిగిన దాడి పై మల్లన్న పోలీసుల కు ఫిర్యాదు చేసినా  ఎటువంటి చర్య తీసుకోలేదని తెలిసిందని వేదిక ప్రకటనలో పేర్కొంది. తీన్మార్ మల్లన్న గతంలో పలుమార్లు వేధింపులకు గురయ్యాడు అని పేర్కొంటూ ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తు న్నందుకు ,ప్రభుత్వ పాలసీలపై  భిన్న అభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నందుకు  పోలీసులు కక్ష పూరితం గా,చట్ట వ్యతిరేకంగ వ్యవహరిస్తూ వస్తున్నారు..తెలంగాణ లో ప్రభు త్వాన్ని విమర్శిస్తే సహించకూడ దనే  ఒక చట్ట వ్యతిరేక ధోరణిని  ని పోలీసులు అమలు పరుస్తున్నట్టు అనిపిస్తుంది.. గతంలో కొన్ని సంఘటనలు గమనిస్తే   ప్రభుత్వం, పోలీసు శాఖా కు, పార్టీ కార్య కర్తలకు  చట్టాలను పట్టించుకోకుండా ఉండే పూర్తి స్వేచ్ఛ (IMPUNITY) ఇచ్చిందని  భావించ వల్సి వస్తుంది..ఇటవంటి  చర్యలు రాజ్యాంగంలో పొందుపరిచిన భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యం లో నిరసన తెలిపే  హక్కులకు వ్యతి రేకం  అని ప్రభు త్వానికి, పోలీసు  శాఖకు చెప్పవలసి వస్తుంది. .ఇప్పటి కైనా ప్రభుత్వం ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యలను మానాలని, భావ ప్రకటన స్వేచ్చకు భంగ పరిచే రీతిగా వ్యహరించకూడదని  చట్టబద్ధ పాలన సంస్కృతి కి కట్టుబడి ఉండాలని మానవ హక్కుల వేదిక కోరుతూ…తీన్మార్ మల్లన్న ను, విఠల్ లను తక్షణమే విడుదల చేయాలనీ, వారిపై వ్యక్తిగత వేధింపులు ఆపివేయాలనీ డిమాండు చేస్తున్నట్లు
 వేదిక  ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటి సభ్యుడు ఎస్.జీవం కుమార్ , తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భుజంగ రావు , ప్రధాన కార్యదర్శి డా.తిరుపతయ్య ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page