‌ప్రతీ నోటిఫికేషన్‌ ‌లో గందరగోళమే..

సింగరేణి నుంచి నేటి వరకు లీకేజీలే
విద్యామంత్రి ఉండగా కెటిఆర్‌ ఎం‌దుకు మాట్లాడాలి..
కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి

 

తెలంగాణా పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌పేపర్‌ ‌లీక్‌ ‌వ్యవహారంలో రోజుకో నాటకం ఆడుతు న్నారని కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. కేటీఆర్‌ ‌రివ్యూ వి•టింగ్‌కు సిట్‌ అధికారుల్ని ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. తనకు సంబంధం లేందంటున్న కెసిఆర్‌ ‌విద్యాశాఖమంత్రితో మాట్లాడించకుండా ఆయనే ఎందుకు చెప్పారనిరేవంత్‌ ‌ప్రశ్నించారు. పేపర్స్ ‌లీక్‌ ‌వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలను కాపాడు తున్నారని రేవంత్‌ ఆరోపించారు. కేటీఆర్‌ ‌కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు.సిట్‌ ‌చెప్పకుండానే ఇద్దరు నిందితులని కేటీఆర్‌ ఎలా చెప్పారని ప్రశ్నించారు. 9 మందిని అరెస్ట్ ‌చేస్తే ఇద్దరే నిందితులని ఎలా అవుతారని ప్రశ్నించారు. అసలు పేపర్‌ ‌లీక్‌ ‌వ్యవహారానికి ఐటీ మంత్రికి సంబంధం ఏంటని రేవంత్‌ ‌ప్రశ్నించారు.పేపర్‌ ‌లీక్‌ ‌కేసులో ఒక నిందితుడు బీజేపీ క్రియాశీలక కార్యకర్త అనీ,బీఆర్‌ఎస్‌,‌బీజేపీ లు నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడుతున్నాయి అని ఆరోపించారు. తెలంగాణ మోడల్‌ అం‌టే మినిమమ్‌ ‌గవర్ననెన్స్ ‌మ్యాగ్జిమమ్‌ ‌పాలిటిక్స్ అని అన్నారు. దేశంలో పార్టీ విస్తరణపై కేసీఆర్‌ ‌దృష్టి పెట్టారని.. ఎగ్జామ్స్ ‌రద్దు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కొత్తగా ఏర్పడ్డ రాష్టాన్రికి బాధ్యాతారహిత నేత సీఎం అయ్యిండని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ ‌ప్రజలను పశువుల కంటే హీనంగా చూస్తున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక వచ్చిన ప్రతీ నోటిఫికేషన్‌ ‌లో గందరగోళమేనని రేవంత్‌ ‌చెప్పారు. 2015 లో సింగరేణి నియామకాల్లో అవకతవకలు, 2016 ఎంసెట్‌ ‌పరీక్ష పేపర్‌ ‌లీక్‌ .. ‌మళ్లీ 2017 లో సింగరేణి నియామకాల్లో ప్రశ్నాపత్రాలు లీక్‌ ,2019‌లో ఇంటర్‌ ఎగ్జామ్‌ ‌పేపర్స్ ‌దిద్దడంలో లోపభూయిష్టం ఇలా అన్నింట్లో ప్రభుత్వ వైఫల్యం బయటపడిందన్నారు. ఇంటర్‌ ఎగ్జామ్‌ ‌పేపర్‌ ‌దిద్దడంలో 60 వేల తప్పులు దొర్లాయని ప్రభుత్వమే చెప్పిందని.. దీని వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని రేవంత్‌ ‌వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page