‘‘ నేడు మోదీ అదే ఫ్యూడల్ పాలనను పునరుద్ధరించడానికి ఏకంగా హిట్లర్ పాలనా కొనసా గిస్తున్నారు. అందుకోసం ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేస్తున్నారు. దానిపై తిరుగుబాటే శరణ్యమని భావించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీకి ప్రత్యమ్నాయం బీఆర్‌ఎస్ మాత్రమేనని, జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అసమ్మతి స్వరాలు ఆదిలోనే అణచివేయాలనీ, ఏదోరకంగా భయోత్సవాన్ని సృష్టించడం కోసం బీజేపీ మౌత్ పీస్ గా ఉన్న రాజ్యాంగ సంస్థలు ఈడీ, సీబీఐ ను ఉసికొల్పి బీజేపీ విధానం గిదేనని చెప్పకనే చెప్పుచున్నారు.’’
నరేంద్ర మోదీ పాలన నాటి ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తుకు తెస్తోంది. ఇందిరాగాంధీ పాలనలో 21 నెలలు మాత్రమే ఎమెర్జెన్సీ చుస్తే, నేడు మోదీ నాయకత్వంలో ఎనిమిది ఏండ్ల నిరంకుశ పాలన కొనసాగుతోంది. 2015 లోనే మోదీ చర్యలను గమనించిన అద్వానీ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మరల ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి తలెత్తదని చెప్పలేమని పరోక్షంగా హెచ్చరించిన సందర్భం గుర్తుకొచ్చింది. ఎమర్జెన్సీకి ముందు ఇందిరా గాంధీ కనీసం కంటితుడుపు గానైనా ఫ్యూడల్ వ్యతిరేక చర్యలను చేపట్టారు.కాని నేడు మోదీ అదే ఫ్యూడల్ పాలనను పునరుద్ధరి ంచడానికి ఏకంగా హిట్లర్ పాలనా కొనసా గిస్తున్నారు. అందుకోసం ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేస్తున్నారు. దానిపై తిరుగుబాటే శరణ్యమని భావించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీకి ప్రత్యమ్నాయం బీఆర్‌ఎస్ మాత్రమేనని, జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అసమ్మతి స్వరాలు ఆదిలోనే అణచివేయాలనీ, ఏదోరకంగా భయోత్సవాన్ని సృష్టించడం కోసం బీజేపీ మౌత్ పీస్ గా ఉన్న రాజ్యాంగ సంస్థలు ఈడీ, సీబీఐ ను ఉసికొల్పి బీజేపీ విధానం గిదేనని చెప్పకనే చెప్పుచున్నారు. సరిగ్గా 47 సంవత్సరాల క్రితం దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన చీకటి దినం, మరువకముందే ఏడు నెలలుగా దిల్లీ మద్యం కేసులో ఇరికించాలని ఎందుకంత హడావుడి చేస్తుందో అర్థం కానంత ఎర్రిబాగులు తెలంగాణలో లేరు. కేసీఆర్ ను ఎదుర్కొనలేక కుటుంబ సభ్యులపై దాడికి దిగింది. మార్చి,11న విచారణ పేరుతో 9గంటలు అరాచకం సృష్టించింది. మళ్ళీ 16న రావాలని హుకుం జారీ చేసింది.ఉద్దేశపూర్వకంగా దర్యాప్తు పేరిట వాయిదాలు వేస్తూ,పైశాచిక ఆనందం పొందుతున్నది. . కవిత అరెస్టుకు కుట్రలు పన్నుతోంది. అనారోగ్య కారణాలతో హాజరు కాలేకపోతున్నానని,అయినా రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో లేఖ రాసింది.అదే విధంగా సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉందని, కోర్టు నిర్ణయం తర్వాత తప్పకుండా హాజ• •వుతా నని లేఖలో స్పష్టం చేసింది.చాలదన్నట్లుగా ఈడీ ఒకవైపు,మోదీ కుట్రలతో అబద్దపు ప్రచారం ఒక వైపు గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తుంది.ఈ నెల 20వ తేదీ రావాలని నోటిస్ జారీచేసినట్లు ప్రచారం జరిగింది.
ప్రస్తుత కాలంలో రాజకీయాలంటే ప్రతీకార రాజకీయాలే. అధికార పార్టీలు ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకునే, వాటిని కలుపుకుపోయే రాజకీయాలు ఏనాడో అంతరించాయి. ప్రతిపక్షాలు అవసరమైనప్పుడు ప్రభుత్వానికి సహకారం అందించే రాజకీయాలు ఎప్పుడో తెరమరుగయ్యాయి. ఒకరినొకరు ఎలా అంతమొందించు కోవాలనే రాజకీయాలే ఇప్పుడు నడుస్తున్నాయి. ఇవాళ మోదీ -షా లను ఫాసిస్టు భాజపా నీతిమంతులుగా పేర్కొనడం చరిత్రను మతోన్మాదీకరించడమే. ఇది రాజకీయ ప్రయో జనాల కోసం అవకాశవాదానికి పాల్పడడం తప్ప మరొకటి కాదు. చరిత్రను ఈ రకంగా వక్రీకరించడాన్ని ప్రతిఘటించేందుకు యావత్తు ప్రజాస్వామిక, విప్లవ, ప్రగతిశీల, యువ శక్తులు సిద్ధం అయ్యారు.ఈ రకంగా మాత్రమే మనం మన చరిత్రను, మన పోరాటాన్ని, మన త్యాగా లను,మన ఉనికినీ తిరిగి పొందగలుగుతాం. అనేది బలంగా నమ్ముతున్నారు. కార్పొరేట్ శక్తుల దోపిడీ శృంఖలాలను బద్దలు కొట్టేందుకు ఒక కొమురం భీం, దొడ్డి కొమురయ్య, బందగీ, ఐలమ్మ, రాణిరుద్రమను కన్న గడ్డ ఎన్నడూ మరిచిపోదు. కేసీఆర్ నాయకత్వంతో చరిత్ర పునరావృతం అవుతుంది. కాబట్టే ఫాసిస్టులు చరిత్రకు భయపడతారు. కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ రాష్ట్రంలోని ప్రతిపక్షాలనూ పైకి లేవనీయకుండా అడుగడుగునా తొక్కే ప్రయత్నం చేస్తున్నది. ప్రతిపక్షాలను పూచికపుల్లను తీసి పారేసినట్లు తీసిపారేస్తున్నారు. ప్రధాని మోదీ విపక్షాలను దూరంగా ఉంచాలన్న ప్రభుత్వ నిర్ణయాలే ఈరోజు విమర్శలకు తావిస్తోంది.తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడనేది మర్చిపోయి, దిల్లీ లిక్కర్ కేసులో, జాతీయవాదం ఎత్తుకున్న ఆప్ ,బీఆర్‌ఎస్ నాయ కులను ఇరికించే ప్రయత్నంగా వ్యవ హరి స్తున్నది. అయినా నిజం నిలకడ మీద తెలుస్తుంది. కానీ అంతలోగా అబద్దం సమస్త లోకాన్ని చుట్టేసి వస్తుంది. ప్రజా సమూహాల నడుమ విద్వేషాలకు అంటకడుతుంది. కొన్ని సందర్భాల్లో అది దారుణ హింసోన్మాదాన్ని ప్రేరేపిస్తుంది. బీజేపీ సర్కారు నియంతృత్వానికి పరాకాష్ట. అధికారం శాశ్వతం కాదు. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. దేశ వ్యాప్తంగా వస్తున్న వ్యతిరేకతను అపహాస్యం చేయడం ఎంతమాత్రం మంచిది కాదని బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందనే అభిప్రాయం నెలకొంది.
బీఆర్‌ఎస్ స్థాపనతో నిస్పృహ కు గురైన మోదీ , అమిత్ షాల ద్వయం మరిన్ని ప్రజా వ్యతిరేక చర్యలకు, నిరంకుశ విధానాలకు తెగపడింది. మోదీ హయాంలో అత్యవసర పరిస్థితి విధించకుండానే పౌరహక్కులు కాలరాయబడుతున్నాయి. రాజ్యాంగ విధ్వంసం చేసి, రాజ్యాంగ సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని ప్రశ్నించినవారిని అక్రమ కేసుల్లో నిర్బంధి ంచడం సర్వసాధారణమైంది. కేసీఆర్ సారథ్యం లో మోదీ వ్యతిరేక శక్తులన్నింటినీ జయప్రకాష్ నారాయణ్ కూడగట్టినట్టే విపక్షాలన్నింటిని ఏకం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజల మద్దతు ఉందని విర్రవీగిన ఇందిరను 1977 లో దేశమంతా ఆమె పార్టీని ఘోరంగా ఓడించారు. అదో చారిత్రాత్మక ప్రజా తీర్పు. అప్పుడుగాని దేశంలో తిరిగి సాధారణ పరిస్థితులు పునరుద్ధరించబడలేదు. ఇప్పుడు విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లు ప్రవరిస్తున్న తీరు వర్ణనాతీతం. చాలా రాష్ట్రాల్లో గవర్నర్లు అక్కడి ప్రభుత్వాలతో పోరాడుతున్నారు, అవి కూడా బీఆర్‌ఎస్ మాదిరిగానే ఎదురు తిరుగుతున్నారు.చాలా మంది గవర్నర్లు కేసీఆర్ ను ఆదర్శంగా స్వీకరించినట్టు కనిపిస్తోంది.కేసీఆర్ మాత్రం మరో జయప్రకాశ్ నారాయణ్ కాకతప్పదు. తెలంగాణ ఉద్యమంలో నిద్రాణమైఉన్న మీలోని దివ్యాత్మకశక్తిని మరోమారు బహిర్గతం చేయాల్సిన పరిస్థితి దేశం కోసం రానే వచ్చింది. బండి సంజయ్ మహిళ అని చూడకుండా కండ కావురంతో కవితపై చేసిన వ్యాఖ్యలు దేశ చరిత్రలో ఃచీకటి రోజుఃగా మహిళాలోకం రగిలిపోతుంది. ఈ జాడ్యం దేశం అంతా బాకింది. మతతత్వం మాయాయవనిక తొలగిపోయింది. ఛాందసవాదుల అహంకారం ఉన్ములితమైంది.మహాత్ములందరికి ఎదురైనట్లే తనయ కవిత విషయంలోనూ కేసీఆర్ జీవితంలో కళ్ళముందు కన్న కలలు కల్లలవడం చూడాల్సి వస్తుంది. శ్రవణతో వినాల్సి వస్తుంది.అయితే లక్ష్యనిర్దేశంలో కొన్ని వివాదాలున్నా ప్రజల చైతన్య దీప్తికి అహరహం కృతనిశ్చయంలో అగ్రగామి కేసీఆర్ స్థానమే. ప్రజాస్వామ్యానికి ప్రాణాధారమైన ప్రజల భావ ప్రకటనా స్వేఛ్చను హననం చేస్తూ మతసామరస్యం దెబ్బతీస్తూ మూకదాడులకు కారణం అవుతున్న మోదీ కి చరమగీతం పడాల్సిన అవసరం ఉంది.
డా।। సంగాని మల్లేశ్వర్
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,కాకతీయ విశ్వవిద్యాలయం,

వరంగల్, 9866255355