మేధావియువత రాజకీయాల్లోకి రావాల్సిందే !

‘‘అష్టకష్టాలు పడుతూ, అలుపెరుగని పోరాటంచేస్తున్న  యువతను ఉద్యోగ నియామకాలంటూ ఎన్నికలు రాబోయే ముందు నోటిఫికేషన్‌ ‌వేసి వారి కసిని మరొకసారి పుస్తకాలపై మరల్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారన్నది తేటతెల్లమవుతుంది.అన్నింటికంటేముందు గ్రూప్‌ ‌వన్‌ ‌ప్రిలిమ్స్ ‌లో ఒక పోస్ట్ ‌కు 50మంది చొప్పున,503 పోస్టులకుగాను 25,050 మంది అభ్యర్థులను ఎంపికచేసిన విషయం అందరికీ తెలిసిందే.అలాగే జూన్‌ ‌లో మెయిన్స్ ‌పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.ఇదిలాగుంటే తెలంగాణ స్టేట్‌ ‌పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌నుండి గ్రూపు 2,3,4లలో నోటిఫికేషన్‌ ‌విడుదలచేసి పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులను పుస్తకాల పురుగుగా తయారుచేసింది.ఇలాగే విభిన్నవిభాగాల్లో పోలీస్‌,‌విద్యా,బ్యాంకింగ్‌ ‌తదితర రంగాలలో నోటిఫికేషన్‌ ‌జారీచేసి చదువుకున్నయువతను తాజా రాజకీయ పరిస్థితుల గురించి ఆలోచించకుండా చేస్తుందనడంలో నిజం లేకపోలేదు.’’

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సాధకబాధకాల గురించి వర్ణించాలంటే ‘‘వ్రాస్తే రామాయణమంతా – చెబితే మహా భారత మంతా’’ ఉంటుందటంలో ఎలాంటి అతిశ యోక్తిలేదు. ప్రత్యేకంగా ఒకవిషయాన్ని ప్రస్తావించాలనుకుంటే ప్రత్యేకత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు,నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నప్పటికీ అలాంటి సాధించిన చిరకాలస్వప్నంలో పాల్గొన్నందుకు వారిజీవితం సార్ధదకమైందని భావించాలి. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తు తరాలకు ఎప్పుడోఒకప్పుడు మేలు జరుగు తుందన్నమాట వాస్తవం.నాణ్యతయుతమైన విద్య,ఉద్యోగవకాశాలు వస్తాయని ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి యువతలో వెయ్యికిపైగా ప్రాణాలర్పించుకున్న ఈ 8ఏళ్లలో జరిగిన అన్యాయాన్ని మాటల్లో వర్ణించలేం. కానీ ప్రస్తుత పరిస్థితులలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే… ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగాలురాని యువత,మేధావివర్గం రాజకీయ ంలోకి రావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఉన్నత విద్యావంతులు సమాజంపట్ల అవగాహన,పోరాటతత్వం,రాజకీయపార్టీల పనితీరుపై ఎప్పటికప్పుడు విశ్లేషించే సామర్థ్యం, సామాజికమాధ్యమాలలో విశిష్టప రిజ్ఞానం ఇవన్నీ తోడైనప్పుడు నిస్వార్థంతో రాజకీ యాలలోకివస్తే ప్రజలుసైతం గుండెలకత్తుకుం టారనడంలో నిజంలేకపోలేదు.

అష్టకష్టాలు పడుతూ, అలుపెరుగని పోరాట ంచేస్తున్న  యువతను ఎన్నికలు రాబోయే ముందు  ఉద్యోగ నియామకాలంటూ నోటిఫికేషన్‌ ‌వేసి వారి కసిని మరొకసారి పుస్తకాలపై మరల్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారన్నది తేటతెల్లమ వుతుంది.అన్నింటికంటేముందు గ్రూప్‌ ‌వన్‌ ‌ప్రిలిమ్స్ ‌లో ఒక పోస్ట్ ‌కు 50మంది చొప్పున, 503 పోస్టులకుగాను 25,050 మంది అభ్యర్థులను ఎంపికచేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే జూన్‌ ‌లో మెయిన్స్ ‌పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలాగుంటే తెలంగాణ స్టేట్‌ ‌పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌నుండి గ్రూపు 2,3,4లలో నోటిఫికేషన్‌ ‌విడుదలచేసి పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్య ర్థులను పుస్తకాల పురుగుగా తయారుచేసింది. ఇలాగే విభిన్నవిభాగాల్లో పోలీస్‌,‌విద్యా,బ్యాంకింగ్‌ ‌తదితర రంగాలలో నోటిఫికేషన్‌ ‌జారీచేసి చదువుకున్నయువతను తాజా రాజకీయ పరిస్థితుల గురించి ఆలోచించకుండా చేస్తుందనడంలో నిజం లేకపోలేదు.

ఇక్కడ చదువుకున్న మేధావివర్గం,ఉద్యోగాలకోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగులు ఒకవిషయాన్ని ప్రత్యేకంగా గమనించాలి.
గతంలో గ్రూప్‌ ‌వన్‌ ‌ద్వారా జిల్లా కలెక్టర్స్ ‌గా పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగాలకు రాజీనా మాచేసి ప్రభుత్వపార్టీలలో చేరి నామినేటెడ్‌ ‌గా చట్టసభల్లోకి వెళ్లడం, సివిల్స్ ‌సాధించి ఉద్యోగ పదవీవిరమణ కంటే ముందే వైదొలిగి, రాజకీ యపార్టీలకు అధినాయకత్వం వహించడం, మరికొంతమంది ప్రజాసంఘాలతో కలిసి ప్రజాసమస్యల పరిష్కారాలకోసం పోరాటం చేయడం, పదవీవిరమణ పొందినటువంటి  ఉన్నతాద్యోగులు రాజకీయాలపట్ల మక్కువ ఎక్కువగా చూపడంలాంటి మరెన్నో సంఘటనలను ప్రస్తుతం మనరాష్ట్రంలో తరచుగా చూస్తూనే ఉంటున్నాం. ఇదిలాఉంటే ప్రస్తుత కొంతమీడియా విభిన్న కారణాలవలన ప్రభుత్వ అనుకూలవార్తలకే పరిమితమైనప్పుడు,సామాజిక మాధ్య మాలను పయోగించుకొని ప్రజాసమస్యలపై పోరాటాలు గావించి,ధైర్యంతో ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజల మన్ననలుపొందడం సైతం చూస్తూనే ఉన్నాం.దీన్నంతటిని పరిశీలిం చకుండా ఉద్యోగాలురావని, తృటిలో తప్పిందని క్షణికా వేశంలో ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడటం సగటువ్యక్తిని కలచివేస్తుందని చెప్పకతప్పదు.

చదువుకున్న యువత ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి.చదువుతున్న ప్రతి వ్యక్తికి ఉద్యోగం రాదన్న విషయం అందరికీ తెలిసిందే.ఇక్కడ నాణ్యత యుతమైన విద్య,రిజర్వేషన్స్,‌రోస్టర్‌ ‌పాయింట్స్ అనేవి ప్రధానంగా కీలకపాత్ర వహిస్తాయి. దానికితోడు ప్రభుత్వ నిర్వహ ణలోపాలు,అధికారుల పనితీరువిషయంలో కోర్టులు జోక్యం చేసుకునేదాకా ఫలితాలు వెలువడని పరిస్థితులు దాపురించాయన్న విషయం తెలిసికూడా ఆత్మహత్యలకు పాల్పడం సబబుకాదు. విచక్షణజ్ఞానాన్ని కోల్పోకుండా ఆలోచిస్తే ఎన్నో పరిష్కారమార్గాలు లభిస్తాయన్న విషయం మరవకూడదు.క్షణికావేశంలో నిర్ణయా లను తీసుకొని అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కుటుంబమంతా రోడ్డునపడి తీవ్ర మనోవేదనకు గురవుతుందని విషయాన్ని ప్రతిఒక్క నిరుద్యోగి గ్రహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.తగిన వనరులను సమకూ ర్చుకొని ఉద్యోగ పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు అనివార్యకారణాల వలన సాధించలేకపోతే సమాజంలో బ్రతకడానికి మరెన్నోమార్గాలు ఉంటాయని గ్రహించాల్సిన అవసరం ఉన్నది.

రాజకీయాలలో నెగ్గాలంటే డబ్బు ఏ ప్రధాన్యత వహిస్తుందని అనుకుంటారు.కానీ కొంతవరకు ఉపయోగపడిన, ప్రతిసారి అదే గట్టెక్కిస్తుందనుకుంటే పొరపాటే. ఎందుకంటే రాజకీయనాయకులకంటే ఎక్కువ డబ్బులున్న వ్యాపారవేత్తలందరో ఉన్నారు.అలానే వారు రాజకీయరంగాలలో రాణించగలుగు తున్నారా..? కానీ డబ్బులులేకున్నా ప్రజా శ్రేయస్సుకు అహర్నిశలు పాటుపడినవారు రాజకీ యాలలో రాణించినట్లు చరిత్ర చెబుతుంది.   ప్రజానీకాన్ని పాలించడానికి చట్టసభల్లోకి ఎన్నికవుతున్నా నాయకుల విద్యార్హతలు మరియు ఆ తర్వాత వారి ఆస్తిపాస్తులపై ఆరాతీయండి. ఏమి జరుగుతుందో !ఎలా జరుగుతుందో ! తెలియకమానదు. దీనికి తోడు విన్న రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శించే పదజాలం చూస్తుంటే, బాధేయకమానని పరిస్థితి నెలకొన్నది.

నేటి వర్తమానసమాజంలో రాజకీయాలు చెడిపో యాయని,ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని అత్యున్నత విద్యనభ్యసించిన మేధావివర్గం, కవులు,కళాకారులు,రచయితల ప్రసంగాలలో, రచనలలో తరచుగా కనిపి స్తుంటాయి.అవే రాజకీయాలను ప్రక్షాళన గావించి,ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ,యావత్తు ప్రజానికానికి అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఉన్నదని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రస్తుతం రాజకీయాలు కేవలం ఓటు బ్యాంకుపై ఆధారపడి పథకాలతో పాలనగావిస్తూ లోపాయిగారి విధానంతో తమ పదవులను కాపాడుకుంటూ అడుగులు వేస్తున్నారన్నది అందరికీ తెలిసినవిషయమే.

సమాజ పరిణామక్రమంలో భాగంగా శాస్త్ర, సాంకేతికరంగాలలో ఎన్నో మార్పులు చోటుచే సుకున్నాయి. ప్రతిసమాచారం చరవాణులమూలంగా అరచేతిలో కనిపించే వెసులుబాటు ఉండేపరిస్థితులు కనిపిస్తూ,సహజంగా నేటి యువతలో మార్పులు కనిపిస్తున్న తరుణంలో మేధావివర్గం మౌనాన్నివీడి రాజకీయాలలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.ఎవరో వస్తారు,ఏదో చేస్తారని అనుకోవడం ముప్పే అవుతుంది.సామాజిక మాధ్యమాల విజృంభన విద్యంబుణక్రమంలో భారతరాజ్యాంగం కల్పించిన  మానవహక్కులు,అవకాశాల గురించి మేధావివర్గం ఎప్పటికప్పుడు విశ్లేషణాత్మక సమాచారాన్ని అందిస్తూనే ఉంటారు.వాటిని మననం చేసుకొని ఎవ్వరికివారు, నాయకత్వం వహిస్తూ జాతిని తాకట్టుపెట్టే నాయకులను ఎండగడుతూ,ప్రజాసమస్యలపై స్పందిస్తూ, క్షేమం, సంక్షేమం, అభివృద్ధి, సేవాతత్వంతో సేవలు అందించడానికి యువత ముందుకొచ్చి నాయకత్వంవహిస్తూ, మేధావివర్గానికి ఆసరాగా కొనసాగుతూ ముందుకుసాగాలని ఆశిద్దాం.

– డా.పోలం సైదులు ముదిరాజ్‌,  9441930361.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page