సికింద్రాబాద్‌-‌విశాఖపట్నం మధ్య ‘వందే భారత్‌’

  • వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ…సికింద్రాబాద్‌లో పాల్గొననున్న మంత్రులు
  • వారానికి ఆరు రోజులు మాత్రమే…ఆదివారం సెలవు

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డె•స్క్, ‌జనవరి 14 :  నేడు సికింద్రాబాద్‌-‌వైజాగ్‌ల మధ్య నడిచే ‘వందే భారత్‌’ ఎక్స్‌ప్రెస్‌ ‌రైలును ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించనుండగా సికింద్రాబాద్‌ ‌స్టేషన్‌లో కేంద్ర మంత్రులు వైష్ణవ్‌, ‌కిషన్‌ ‌రెడ్డిలు పాల్గొంటారు. సికింద్రాబాద్‌-‌విశాఖపట్నం మధ్య ఈ రైలు వారానికి ఆరు రోజులు మాత్రమే నడువనుండగా ఆదివారం పూర్తిగా సెలవు ఉంటుంది. రేపు సోమవారం నుంచి ప్రయాణికులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ రెండు నగరాల మధ్య ప్రస్తుతం ఇతర ఏ ఇతర రైలులో వెళ్లినా కనీసం 12 గంటలు పడుతుండగా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ 8.40 ‌గంటల్లో గమ్యం చేరుస్తుంది. రైలు వేగం గంటకు రూ.160 కి.మీ. కాగా ఈ మార్గంలో దీనిని 80 నుంచి 90 కి.మీ. వేగంతో నడుపుతారు. కాగా ఈ రైలు కేవలం నాలుగు స్టేషన్లు వరంగల్‌, ‌ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలోనే ఆగుతుంది.

సికింద్రాబాద్‌ ‌నుంచి విశాఖ వెళ్లే రైలుకు 20834 నెంబరు కేటాయించగా విశాఖ నుంచి సికింద్రాబాద్‌ ‌బయలుదేరే రైలుకు 20833 నెంబరును కేటాయించారు. సాధారణంగా  ఈరైలు ఆదివారం నడువకున్నా నేడు మొదటి రోజు మాత్రం ప్రత్యేకంగా 10.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి రాత్రి 8.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ఒక్కరోజు మాత్రం ఈ రైలు చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్‌, ‌మహబూబాబాద్‌, ‌డోర్నకల్‌, ‌ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. కాగా సోమవారం నుంచి నడిచే రైలు చార్జీలు నిర్ణయించారు. సికింద్రాబాద్‌ ‌నుంచి విశాఖపట్నంకు చైర్‌ ‌కార్‌ ‌టికెట్‌ ‌ధర రూ. 1665 కాగా ఎగ్జికూటివ్‌ ‌క్లాస్‌కు రూ. 3120గానూ, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు చైర్‌ ‌కార్‌ ‌టికెట్‌ ‌ధర రూ. 1720 కాగా ఎగ్జికూటివ్‌ ‌క్లాస్‌కు రూ. 3170గా నిర్ణయించారు.

ఇక ప్రతి రోజూ సికింద్రాబాద్‌ ‌నుంచి మధ్యాహ్నం 3.00 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.35 గంటలకు వరంగల్‌, 5.45 ‌గంటలకు ఖమ్మం, రాత్రి 7.00 గంటలకు విజయవాడ, 8.58 గంటలకు రాజమండ్రి, 11.30 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఇక విశాఖపట్నంలో వందే భారత్‌ ‌రైలు ప్రతిరోజు ఉదయం 5.45 గంటలకు బయలుదేరి 7.55 గంటలకు రాజమండ్రి, 10.00 గంటలకు విజయవాడ, 11.00 గంటలకు ఖమ్మం, 12.05 గంటలకు వరంగల్‌ ‌మీదుగా మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌ ‌చేరుతుంది. రైలులో మొత్త 16 కోచ్‌లు ఉండగా ఎగ్జిక్యూటివ్‌ ‌క్లాస్‌ ‌చైర్‌, ‌చైర్‌ ‌కారు అని రెండు తరగతులు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్‌ ఏసీ కార్‌‌కోచ్‌లో 104 సీట్లు ఉంటాయి. ఇక ఎకానవి• క్లాస్‌లో 1,024 సీట్లు ఉంటాయి. మొత్తంగా ఈ రైలులో ఒకేసారి 1,128 మంది ప్రయాణం చేయొచ్చు. కూర్చుని మాత్రమే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పడుకునే వీలుండదు. పగటి పూట ప్రయాణమే కాబట్టి స్లీపర్‌ ‌కోచ్‌లు ఏర్పాటు చేయలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page