చంద్రబోస్‌ ‌సరస్వతీ పుత్రుడు

  • గోల్డెన్‌ ‌గ్లోబ్‌ అవార్డు రావడం గరక్వకారణం
  • వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్‌ ‌ట్‌లో సన్మానం

హైదరాబాద్‌, ‌జనవరి 14 : చంద్రబోస్‌ ‌సరస్వతీ పుత్రుడు అని మెగాస్టార్‌ ‌చిరంజీవి ప్రశంసించారు. సినీగేయ రచయిత చంద్రబోస్‌ను మెగాస్టార్‌ ‌చిరంజీవి సన్మానించారు. చంద్రబోస్‌ ‌రచించిన నాటు నాటు పాటకు ఇటీవల గోల్డెన్‌ ‌గ్లోబ్‌ అవార్డు రావడంతో ఆయనను సత్కరించారు. వాల్తేరు వీరయ్య విజయోత్సవ సమావేశంలో చిరంజీవి, రవితేజ కలిసి చంద్రబోస్‌ ‌ను శాలువాతో సన్మానించారు.చంద్రబోస్‌ ‌రాసిన పాటకు గోల్డెన్‌ ‌గ్లోబ్‌  అవార్డు రావడం గర్వకారణంగా ఉందని చిరంజీవి అన్నారు. తొలిసారి తెలుగు పాటకు గోల్డెన్‌ ‌గ్లోబ్‌ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. కీరవాణితోపాటు పాటలో భాగస్వాములైన వారందరికి చిరు అభినందనలు తెలియజేశారు.

తెలుగు వాళ్లందరి తరపున చంద్రబోస్‌ ‌కు మెగాస్టార్‌ ‌ప్రత్యేక అభినందనలు చెప్పారు. కాగా, మెగాస్టార్‌ ‌చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ ‌వద్ద చిరు ఫ్యాన్స్ ‌పండుగ చేసుకుంటున్నారు. వాల్తేరు వీరయ్య విజయంతో తనకు మాటలు రావడం లేదని మెగాస్టార్‌ ‌చిరంజీవి అన్నారు. సినిమాకు హిట్‌ ‌టాక్‌ ‌రావడంతో మూవీ యూనిట్‌ ‌సక్సెస్‌ ‌ట్‌ ‌నిర్వహించింది. ఈ సందర్భంగా తనకు ఏం మాట్లాడాలో తెలియడం లేదని.. మనం మాట్లాడటం ఆపేసి ప్రేక్షకుల మాటలు విందామని చిరంజీవి అన్నారు. ప్రేక్షకుల ఉత్సాహమే మన ఇంధనం అని చెప్పారు. సినిమా యూనిట్‌ అం‌తా థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలి చిరు సూచించారు.

ఈ సినిమా కోసం నేను కష్టపడలేదు, నా బాధ్యతగా అనుకుని పనిచేశాను. కష్టం నాది, రవితేజది కాదు. సినిమా బాగా రావాలని పని చేసిన వారిది. వాల్తేరు వీరయ్య సినిమాకు పని చేసిన కార్మికులది. మన ద జాలితో కాదు.. సినిమాపై ప్రేమతో, కష్టపడ్డ కార్మికుల కోసం ప్రేక్షకులు సినిమా చూడాలని చిరు చెప్పారు. విజయాలు వస్తుంటాయి పోతుంటాయి, కార్మికుల కష్టం అందరికీ తెలియాలన్నారు. కాగా ఈ కార్యక్రమంలో వాల్తేరు వీరయ్య సినిమాకు పని చేసిన కార్మికుల కోసం మేకర్స్ ఓ ‌ప్రత్యేక వీడియో తయారీ చేయగా.. దానిని చిరు రిలీజ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page