న్యూ దిల్లీ, జనవరి 14 : మకర సంక్రాంతి, మాగ్ బిహు, ఉత్తరాయన్, పొంగల్, భోగీని పురస్కరించుకుని దేశ పౌరులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగలు భారతదేశ శక్తిమంతమైన సాంస్క•తిక వైవిధ్యాన్ని సూచిస్తాయని మోదీ పేర్కొన్నారు. మకర సంక్రాంతి, మాగ్ బిహు, ఉత్తరాయన్, పొంగల్, భోగి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ప్రకృతి ఆరాధనతో ముడిపడి ఉన్న ఈ పండుగలు ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఆనందాన్ని తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు.’సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని ఆకాంక్షిం చారు.
బోగి పండుగ సందర్భంగా సకల జనులకు ఆ భగవంతుడు భోగభాగ్యాలు, సుఖసంతోషాలు కలిగించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. ప్రజలకు భోగి శుభాకాంక్షలు అని ఎపి గవర్నర్ బిశ్భూషన్ తెలిపారు. ప్రతికూల ఆలోచనలు వదిలి, సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలనే సందేశాన్నిచ్చే ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లోకి నూతన కాంతులను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.