ప్రపంచంలోనే అత్యంత పొడవైన.. గంగా క్రూయిజ్‌ ‌నౌకను ప్రారంభించిన ప్రధాని మోదీ

  • వారణాసి నుంచి దిబ్రూగఢ్‌ ‌వరకు 3200 కి ప్రయాణం
  • పలుసౌకర్యాలతో అత్యంత లగ్జరీ క్రూయిజ్‌

ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్‌ ‌క్రూయిజ్‌ను ఎంవీ గంగా విలాస్‌ను ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ  వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు వారణాసిలో టెంట్‌ ‌సిటీని ప్రారంభించడంతో పాటు రూ.1000 కోట్ల విలువైన అనేక ఇతర అంతర్గత జలమార్గాల ప్రాజెక్టులకు కూడా మోడీ శంకుస్థాపన చేశారు. ‘భారత్‌లో రు ఊహించగలిగేవన్నీ ఉన్నాయి. ఇది  ఊహకు మించినది’ అని ప్రధాని మోడీ ఈ సందర్భంగా అన్నారు. భారతదేశాన్ని మాటల్లో నిర్వచించలేమన్న ఆయన…దీన్ని మన మనసు ద్వారానే అనుభూతి చెందగలమని పర్యాటకులకు ప్రధాని మోదీ చెప్పారు. ఈ కార్యక్రమంలో జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్‌, ఉత్తరప్రదేశ్‌ ‌సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఇతర కేంద్ర మంత్రులు, పలు శాఖల సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. ఈ గంగా విలాస్‌ ‌భారతదేశ మొట్టమొదటి నదీ పర్యటక నౌక. గంగా, బ్రహ్మపుత్ర  నదుల దుగా 3,200 కిలోటర్ల దూరం ప్రయాణించే ఈ లగ్జరీ నౌక.. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యాటక నౌకగా కూడా ఖ్యాతిని గడించింది.

ఈ నౌకలో ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో పాటు సూట్‌ ‌గదులు, స్పా, జిమ్‌ ‌సెంటర్లు, ఫ్రెంచ్‌ ‌బాల్కనీలు, ఎల్‌ఈడీ టీవీలు, సేఫ్‌లు, స్మోక్‌ ‌డిటెక్టర్లు, కన్వర్టిబుల్‌ ‌బెడ్లు వంటివి కూడా ఉన్నాయి. 51 రోజుల పాటు సాగే తన మొదటి పర్యటనను వారణాసి నుంచి ప్రారంభించనున్న ఎంవీ గంగా విలాస్‌ .. ‌భారత్‌లోని ఐదు రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను కవర్‌ ‌చేస్తూ మొత్తం 3,200 కి. దూరం ప్రయాణించి దిబ్రూఘర్‌ ‌చేరుకుంటుంది. అంతేకాక 27 నదీ వ్యవస్థల దుగా ఈ నౌక ప్రయాణించనుంది.

ఇక ఈ నౌక తన మొదటి పర్యటనలో భాగంగా ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ ఉద్యానవనాలు, నదీ ఘాట్‌లు, బీహార్‌లోని పాట్నా, జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌, ‌పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, బంగ్లాదేశ్‌లోని ఢాకా, అస్సాంలోని గువాహతి వంటి ప్రధాన నగరాలతో సహా 50 పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తుంది. ఎంవీ గంగా విలాస్‌ ‌తన తొలి ప్రయాణంలో స్విట్జర్లాండ్‌కు చెందిన 32 మంది పర్యాటకులను తీసుకెళ్లనుంది. ఈ క్రూయిజ్‌లో కాలుష్య రహిత వ్యవస్థ, శబ్ద నియంత్రణ సాంకేతికత అమర్చబడిందని స్పష్టం చేశారు.  ఈ క్రూయిజ్‌లో మురుగునీరు గంగలోకి ప్రవహించకుండా మురుగునీటి శుద్ధి కర్మాగారం ఉందని, అలాగే స్నానం, ఇతర అవసరాల కోసం గంగాజలాన్ని శుద్ధి చేసే ఫిల్టేష్రన్‌ ‌ప్లాంట్‌ ఉం‌దని రాజ్‌ ‌సింగ్‌ ‌చెప్పారు. పర్యాటక రంగంలో ఇదో గొప్ప మలుపు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page