అధికారం ముసుగులో
పదవుల కాంక్షతో
అవినీతే పెట్టుబడిగా
నయవంచనే పరమావధిగా
ఉన్నత చదువు లేకున్నా
ఓటు అనే సామాన్యుడి
ఆయుధాన్ని కాసులతో కొని
మాయ మాటలు చెప్పి
అదికారపు సీటు ఎక్కి
కమీషన్ ల కక్కుర్తితో
అందిన కాడికి దోచుకుని
ఉన్నత పదవులు చేపట్టి
సంక్షేమము మరచి
అభివృద్ధిని అటకపై నెట్టి
తరాతరాలకు సంపాదన
దోచిపెట్టడమే లక్ష్యంగా
ఉన్నత పదవులు చేపట్టే
కుటిల రాజకీయనాయకులు
గలస్వార్థరాజకీయాలు
గొచరిస్తున్నాయి నేడు..
ప్రజాక్షేమం,సంక్షేమం మరచి
పూటకొక జెండా,
రోజుకొక పార్టీ అజెండాగా
మారుతున్న రాజకీయనాయకులు..
అక్రమ సంపాదనే ధ్యేయంగా మార్చివేస్తుంటారు
రాజకీయాలను..
పరపాలనలోనే కాదు
స్వరాజ్యపాలనలో సైతంసామాన్యుడు
అణచివేయబడుతున్నాడు
ఇకనైనాకుటిల రాజకీయాలు
పోయి స్వార్థం,స్వలాభం విడనాడి
అభివృద్ధి పథంన దూసుకెళ్లాలి..
ప్రజాసంక్షేమమే లక్ష్యంగా
సాగిపోవాలి.
మార్పులువచ్చి,మార్పులుతెచ్చి..
మారాలి మన నాయకులు!
మారాలి మన నేటి రాజకీయాలు!!
– ఎన్..రాజేష్, (కవి,జర్నలిస్ట్)
హైదరాబాద్