తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే వొస్తుంది

  • అప్పుడు పేదలను అన్ని విధాలా ఆదుకుంటాం
  • గుండెగాం నుంచి మొదలైన పాదయాత్ర
  • ఇక్కడి ప్రజలేం పాపం చేశారని ప్రభుత్వానికి ప్రశ్న
  • సంజయ్‌ ‌యాత్రకు స్వాగతం పలికిన ప్రజలు

నిర్మల్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌30: ‌రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని బండి సంజయ్‌ ‌చెప్పారు. పాదయాత్రలో భాగంగా నిర్మల్‌ ‌జిల్లాలో బండి సంజయ్‌ ‌ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. గుండెగాం సపంలో వ్యవసాయ కూలీలతో మాట్లాడిన బండి సంజయ్‌ ‌వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇండ్లు, పెన్షన్లు రావడం లేదని కూలీలు తమ సమస్యలను వివరించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక అందరికి అండగా ఉంటామని బండి సంజయ్‌ ‌హా ఇచ్చారు. ఉపాధి హా కింద కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పిస్తోందని ఆయన చెప్పారు. ఆ నిధులను కూడా కేసీఆర్‌ ‌ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో పెద్దల రాజ్యం పోవాలి.. పేదల రాజ్యం రావాలి అంటూ నినాదాలు చేశారు. తెలంగాణలో పేదోళ్ల రాజ్యం వస్తేనే.. ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు.

అంతకుముందు గుండెగాంలోకి ప్రవేశించిన బండి సంజయ్‌కు గ్రామస్తుల నుంచి స్వాగతం లభించింది. వెల్కమ్‌ ‌టూ గుండెగాం అని పూలతో నేలపై రాసి గ్రామస్తులు స్వాగతం పలికారు. బండి సంజయ్‌ ‌పై పూలవర్షం కురిపిస్తూ  ఆహ్వానించారు. ప్రజా సంగ్రామ యాత్రకు.. మహిళలు హారతులతో స్వాగతం పలుకగా.. గ్రామ యువత టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. గుండెగాం పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గుండెగాంలో 250 కుటుంబాలనే కాపాడలేనోడు.. తెలంగాణను ఏం కాపాడుతారని విమర్శలు గుప్పించారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, రాష్టాన్న్రి రూ.5 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని ఆరోపించారు. గుండెగాం ప్రజలు ఏం పాపం చేశారు..? ఏటా ఊరు మునిగిపోతున్నా ఎందుకు పట్టించు కోవడం లేదు..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా కష్టాలు, కన్నీళ్లే కనిపిస్తున్నా యని, తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు.

ఇక్కడ సొమ్మును పంజాబ్‌ ‌కు పంచి పెడుతూ.. రాష్ట్ర ప్రజల బతుకులను గాలి కొదిలేస్తారా..? అని నిలదీశారు. ఈసారి వర్షాలు వచ్చి గ్రామం ముంపునకు గురైతే టీఆర్‌ఎస్‌ ‌నేతలను తీసుకొచ్చి గ్రామంలో కట్టేయండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండెగాం బాధితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాల్సిందేనని డిమాండ్‌ ‌చేశారు. డబుల్‌ ‌బెడ్రూం ఇండ్లు పూర్తికాక ముందే చిన్నపాటి వర్షానికే కురుస్తున్నాయని బండి సంజయ్‌ ఆరోపించారు. కేసీఆర్‌ ‌పాలనలో పిల్లల్ని కనాలంటేనే భయపడుతున్నారని, పుట్టబోయే బిడ్డపైనా రూ. 1.2 లక్షల అప్పు చేశారని విమర్శించారు. కేసీఆర్‌ ‌కు పేదలంటే మంట అని, కేసులు పెట్టి వేధిస్తూనే ఉంటారని అన్నారు. పేదలకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్‌ ‌సంగతి చూస్తామని, బీజేపీ అధికారంలోకి రాగానే గుండెగాంను అద్దంలా మెరిపిస్తామని హా ఇచ్చారు.

పేదోళ్ల జాగాల్లోనే పోలీస్‌ ‌స్టేషన్లు,్గ •ర్‌ ‌స్టేషన్లు కడుతున్నారని బండి సంజయ్‌ ‌చెప్పారు. కషన్ల కోసం టీఆర్‌ఎస్‌ ‌నేతలు గద్దల్లా వాలిపోతారని, గుండెగాం ప్రజల సమస్య పరిష్కారం కోసం ఉధృత పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్‌ ‌గుండెగాం గ్రామానికి రావాలని, లేనిపక్షాన గ్రామస్తులే కేసీఆర్‌ ‌దగ్గరికి వెళ్లి, ఆయన సంగతి ఏందో చూస్తారన్నారు. ఉపాధి హా నిధులను కూడా కేసీఆర్‌ ‌దారి మళ్లీస్తున్నారన్న బండి సంజయ్‌..‌రాష్ట్రంలో దోచుకున్న సొమ్మును పత్తాలు, డ్రగ్స్, ‌ఢిల్లీ లిక్కర్‌ ‌స్కాంలో పెడుతున్నారని ఆరోపించారు. మరో ఆరు నెలల తరువాత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page