జనవరి 18న ఛాంబర్ ప్రవేశం చేయనున్న సిఎం కెసిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 28 : కాష్ట్ర కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖారరు అయ్యింది. సంక్రాంతి వెళ్లిన మూడోరోజు అంటే జనవరి18న ప్రారంభానికి సిఎం కెసిఆర్ నిర్ణయించారు.ఈ మేరకు ముహూర్తాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. పాత సచివాలయాన్ని కూలగొట్టి అదే స్థానంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు నిర్మాణం పూర్తి కావచ్చింది. ఈ క్రమంలోనే ప్రారంభోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం డేట్, టైమ్ ఫిక్స్ చేసింది. 2023, జనవరి 18వ తేదీన కొత్త సచివాలయాన్ని ప్రారంభించి ఆ రోజు నుంచి అక్కడ ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభించనుంది. అప్పటికల్లా పనులు పూర్తి చేయాలని ఆర్అండ్బీ అధికారులు, షాపూర్జీ పల్లోంజీ నిర్మాణ సంస్థకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ముందుగా 6వ అంతస్తులోని సీఎం బ్లాకును ప్రారంభించి తన ఛాంబర్లో కేసీఆర్ బాధ్యతలను స్వీకరించనున్నారు.
ReplyForward
|