మొయినాబాద్‌ ‌ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో… నిందితుల బెయిల్‌ ‌పిటిషన్‌ ‌కొట్టేసిన ఎసిబి కోర్టు

మొయినాబాద్‌ ‌ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో నిందితుల బెయిల్‌ ‌పిటిషన్‌ను నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ తరపు లాయర్‌ ‌వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. దర్యాప్తు సమయంలో నిందితులకు బెయిల్‌ ‌మంజూరు చేస్తే కేసును, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్‌ ‌వాదనలు వినిపించారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌ ‌పై పోలీసులు పిటీ వారెంట్‌ ‌కోరారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్ ‌పోలీసులు పీటీ వారెంట్‌ ‌దాఖలు చేశారు. ఇదిలా ఉంటే..నందకుమార్‌పై బంజారాహిల్స్ ‌పీఎస్‌లో 2 కేసులు నమోదయ్యాయి. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడ్ని అరెస్ట్ ‌చేసేందుకు అనుమతించాలని పోలీసులు కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏ2గా ఉన్న నందకుమార్‌.. ఇప్పటికే చంచల్‌ ‌గూడ జైలులో రిమాండ్‌ ‌ఖైదీగా ఉన్నాడు. పోలీసులు వేసిన పీటీ వారెంట్‌కు నాంపల్లి కోర్టు అనుమతిస్తే.. నిందితుడు నందకుమార్‌ను అరెస్ట్ ‌చేసి తిరిగి కోర్టులో హాజరుపరుచనున్నారు.

నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పోలీసుల తరఫున న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. దర్యాప్తు సందర్భంలో బెయిల్‌ ఇస్తే ఆటంకం ఎదురవుతుందన్న న్యాయవాది వాదనతో ఏకీభవించిన కోర్టు.. నిందితుల బెయిల్‌ ‌పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రస్తుతం నిందితులు రామచంద్రభారతి, నందకుమార్‌, ‌సింహయాజీలు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ‌ఖైదీలుగా ఉన్నారు. ఇదిలా ఉండగా.. నందకుమార్‌పై మరో రెండు కేసులు నమోదయ్యాయి. డెక్కన్‌ ‌కిచెన్‌ ‌యాజమాన్యంతో పాటు నందకుమార్‌ ‌వద్ద స్థలం లీజుకు తీసున్న మరో వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. 2021 జూన్‌లో తమ ప్రాంగణాన్ని నందకుమార్‌ ‌వ్యాపారానికి వాడుకోమ్మన్నాడని, తన సోదరులతో కలిసి 3వేల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు అయాజ్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో వైపు నాంపల్లి కోర్టులో పోలీసులు పీటీ వారంట్‌ ‌దాఖలు చేశారు. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా నందకుమార్‌ అరెస్టుకు పోలీసులు న్యాయస్థానం అనుమతి కోరుతూ పీటీ వారంట్‌ ‌దాఖలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page