‘‘ఇంకా మనం ఈ బడులలో ఉన్న డిజిటల్ గ్రంథాలయాల సంఖ్య పరిస్థితి చూస్తే అది మరి దారుణం కేవలం 772 బడులలో మాత్రమే డిజిటల్ లైబ్రరీలు అందుబాటులో ఉన్నాయి, ఈ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ వరల్డ్ అని ఉపన్యాసాలు దంచుతున్నాయి కానీ మన భావితరాలు నేర్చుకునే బడులలో కనీస డిజిటల్ వసతులు లేకపోవడం వారిని నేటి డిజిటల్ పోటీ ప్రపంచం నుంచి దూరం చేయదా? ఈ మాత్రం వాస్తవాలు మన ప్రభుత్వ పెద్దలకు తెలియవా?’’
రాష్ట్రము వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం బతుకులు ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా మారుతాయి అని ఆశించి రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల, వర్గాల ప్రజలు ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే ఈ ఉద్యమంలో ప్రత్యేక పాత్ర పోషించింది మాత్రం అణగారిన కులాల ప్రజలు అందులో అందరికంటే అత్యధికంగా మాత్రం విద్యార్థులు అని చెప్పడంలో ఎవరికి ఏ సందేహం ఉండదు, అయితే కొన్ని సార్లు సాధారణంగా ప్రజా వేదికలలో నాయకులు ఇంకా ఇతరులు ఈ ఉద్యమాలలో తెలంగాణలోని ప్రధాన విశ్వ విద్యాలయాల విద్యార్థులు మాత్రమే పాల్గొన్నారు అనే కోణంలో ప్రస్తావిస్తారు కానీ అది పూర్తిగా నిజం ఏమి కాదు అనే విషయం ఈ ప్రజా ఉద్యమాలను ప్రత్యేక్షంగా చూసినా మరియు పాల్గొన్న వారికీ మాత్రం అసలు వాస్తవాలు ఏమిటి అనేది తెలుస్తోంది. తెలంగాణ లోని స్కూల్స్, జూనియర్ కాలేజీ, మరియు ఇతర ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు కూడా సొంత రాష్ట్ర సాధనలో స్వార్ధంలేని కృషి చేసారు, అయితే ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు ప్రధానంగా చర్చ చేయాల్సి వస్తుంది అంటే ఈ నెలలో కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన యు. డి . ఐ. స్. ఏ 2021-22 విద్య పాఠశాలలకు సంబంధించిన నివేదికలలో దేశ వ్యాప్తంగా బడికి పోయే విద్యార్థులు అనేక సమస్యలు ఎదురుకుంటున్నారు అని పేర్కొన్నారు.
ఈ తరుణంలో తెలంగాణా రాష్ట్రంలో యు. డి . ఐ. స్. ఏ 2021-22 నివేదిక ప్రకారం ఏ విధంగా రాష్ట్రంలో పాఠశాలలో కనీస సదుపాయాలు ఉన్నాయి అనేది చూద్దాం. అయితే తెలంగాణ రాష్ట్రము మొత్తంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కలిపి సుమారు 43083 ఉన్నాయి అందులో మొత్తం 6915241 విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు అయితే రాష్ట్రము మొత్తంలో ఈ పాఠశాలలో సుమారుగా 320894 ఉపాధ్యాయులుగా వారి వృత్తి కొనసాగిస్తున్నారు. ఇంకా ఇదే కాకుండా మనం రాష్ట్రంలో మొత్తం బడులలో టీచర్స్ సగటు చూసినప్పుడు ఒక పాఠశాలకు కేవలం 7 గురు టీచర్స్ మాత్రమే ఉండడం కొంచం ఆందోళనను గురి చేసే విషయం. ఇది ఇంకా లోతులోకి వెళ్లి చేస్తే రాష్ట్రంలో ఉన్న బడులలో 43083 కేవలం 31716 పాఠశాలలకే విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఆటలు ఆడుకునే మైదానాలు ఉన్నాయి. ఇంకా మనం ఈ బడులలో ఉన్న డిజిటల్ గ్రంథాలయాల సంఖ్య పరిస్థితి చూస్తే అది మరి దారుణం కేవలం 772 బడులలో మాత్రమే డిజిటల్ లైబ్రరీలు అందుబాటులో ఉన్నాయి, ఈ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ వరల్డ్ అని ఉపన్యాసాలు దంచుతున్నాయి కానీ మన భావితరాలు నేర్చుకునే బడులలో కనీస డిజిటల్ వసతులు లేకపోవడం వారిని నేటి డిజిటల్ పోటీ ప్రపంచం నుంచి దూరం చేయదా? ఈ మాత్రం వాస్తవాలు మన ప్రభుత్వ పెద్దలకు తెలియవా? ఇంకా ప్రధానంగా మన విద్యార్థులకు కావాల్సిన టాయిలెట్స్ చూసినప్పుడు మన రాష్ట్రంలో 43083 పాఠశాలలో మొత్తం 33428 పాఠశాలలో బాలికలకు అత్యవసరమైన టాయిలెట్స్ సదుపాయాలు ఉన్నాయి ఇంకా సుమారుగా 10 వేల పాఠశాలలో కనీస టాయిలెట్స్ లేవు ఇదే సమస్య బాలురులకు కూడా అంతే మాదిరిగా ఉన్నదీ మనం రాష్ట్రము మొత్తం లో ఉన్న 43083 పాఠశాలలో కేవలం 29137 పాఠశాలలో మాత్రమే పురుష విద్యార్థులకు టాయిలెట్స్ సదుపాయాలు ఉన్నాయి.
ఇంకా తాగునీరు అందుబాటులో లేని పాఠశాలలు 6 వేలకు పైగా రాష్ట్రంలో ఉన్నాయి. చివరిగా మొన్నటి వరకు కరోనా వ్యాధి కారణంగా మన పిల్లలు ఆన్లైన్ అని వారి విద్యను అరకొర సాగించారు అయితే అందులో కూసంత ఆర్ధికంగా బలంగా ఉన్నవారు మంచి వసతలతో డెస్క్టాప్, లాప్టాప్, వైఫై, ట్యాబ్ లాంటి పరికరాలతో వారి విద్యను కొనసాగించారు, మధ్యతరగతి కుటుంబాలు కొద్దొ గొప్ప వారికీ ఉన్న దానిలో మొబైల్ డేటా తో వారి విద్యను ఓ మాదిరిగా సాగించిన విషయం మనం అందరం మన చుట్టూ చూసినవాళ్ళమే, అయితే ఈ కరోనా కాలంలో ప్రధానంగా నష్టపోయిది మాత్రం అణగారిన గ్రామీణ, పట్టణ పేదరికం నుంచి వచ్చి ప్రభుత్వ విద్యాసంస్థలో విద్యను కొనసాగిస్తున్న విద్యార్థులు అయితే ఈ కొరోనా వ్యాధి మనకు నేర్పిన పాఠాలు చూసి అయినా మన ప్రభుత్వాలు కనీసం విద్యను పటిష్టం చేయాలి రేపటి తరానికి కావలసిన పాఠశాల విద్య వ్యవస్థకు అవసరమైన బలమైన మౌలిక సదుపాయాలను మన రాష్ట్రంలోని పాఠశాలలో తీసుకోని రావాలి యు. డి . ఐ. స్. ఏ 2021-22 విద్య సంత్సరానికి సంబంధించిన పాఠశాలల నివేదికలలో ఈ కనీసం మౌలిక వసతులు లేని ఉదాహరణ టాయిలెట్, స్కూల్ లైబ్రరీలు, పిల్లలు ఆడే మైదానాలు, సరిపడా టీచర్స్, స్కూల్ లో ఆన్లైన్ సదుపాయం, డిజిటల్ లైబ్రరీలు మరియు ఇతర సరిపడా నైపుణ్యాలు నేర్పే పరికరాలు లేకుంటే ఏ విధంగా మన విద్యార్థులు రేపటి పోటీ ప్రపంచాన్ని ఎదురుకోగలరు, మరియు ఏ విధంగా ప్రభుత్వాలు కొరోనా లాంటి వ్యాధులు వస్తే విద్యార్థులకు ప్రత్యన్నమైన పద్ధతుల్లో నాణ్యమైన విద్యను మన విద్యార్థులకు అందజేయగలవు?.
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఇతర ప్రధాన పార్టీలు మొన్నటికి మొన్న మొనుగోడు ఎన్నికలలో వందల కోట్ల రూపాయలను ఏ కట్టడి లేకుండా ఓట్లను నోటు తో కొన్నారు, అదే ఇటువంటి పౌరుల ప్రాథమిక హక్కు గురించి మాత్రం మౌనంగా ఏ చర్యలు తీసుకోరు. ఏదిఏమైనా కనీసం టాయిలెట్స్, తాగునీరు, మైదానాల వసతులు పాఠశాలలో కల్పించలేని మన ప్రభుత్వాలు ఏ విధంగా ప్రపంచస్థాయి అవార్డులు మేధావులు మన పిల్లలు కావాలి అని ఆశపడుతున్నారో ఎవరికీ అర్ధం కాదు. బంగారు తెలంగాణ వెండి తెలంగాణ అని కాకుండా కనీసం ఇప్పుడు అయినా మన ప్రభుత్వం మన బడులను ప్రపంచస్థాయి విధానాలతో వాటిని మెరుగుపరిచి మన విద్యార్థులలో విద్యను నేర్చుకునే ఆసక్తిని పెంచాలి అప్పుడే మన విద్యార్థులు కొట్లాడి తెచ్చేకున్న తెలంగాణకు ఓ అర్ధం వుంటుంది.
అశోక్ ధనావత్, ఎం. ఏ డెవలప్మెంట్ స్టడీస్
ఇంటెర్నేషన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సోషల్ స్టడీస్,
ది హాగ్, నెథర్లాండ్స్