- ప్రాథమిక స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
- వాయు కాలుష్యంపై మానవ హక్కుల సంఘం ఆగ్రహం
- దిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ కార్యదర్శులకు నోటీసులు
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం అంతకంతకూ పెరుగుతోంది. ఎయిర్ క్వాలిటీ రోజురోజుకూ తగ్గిపోతుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజీవ్రాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రైమరీ స్కూళ్లు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాలుష్యం తగ్గే వరకు స్కూళ్లు మూసేవేస్తామని చెప్పారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో కలిసి డియాతో మాట్లాడిన కేజీవ్రాల్ ఈ మేరకు నిర్ణయం వెలువరించారు. ప్రైమరీ స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం 5 నుంచి 8వ తరగతి విద్యార్థుల ఔట్ డోర్ యాక్టివిటీస్పై నిషేధం విధించారు.
వాయు కాలుష్యం పెరుగుతున్నందున ఢిల్లీలో సరిబేజీసి విధానం అమలు చేయడంపై ఆలోచిస్తున్నట్లు కేజీవ్రాల్ చెప్పారు. వాయు వాయు కాలుష్యానికి పంజాబ్ ప్రభుత్వమే కారణమన్న విమర్శలపైనా ఆయన స్పందించారు. ఆప్ సర్కార్ ఏర్పడి 6 నెలలే అయిందనీ… వచ్చే ఏడాది కల్లా రైతులు పొలాల్లో గడ్డిని కాల్చకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని కేజీవ్రాల్ స్పష్టం చేశారు.
వాయు కాలుష్యంపై మానవ హక్కుల సంఘం ఆగ్రహం
దిల్లీలో వాయు కాలుష్యంపై జాతీయ మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రభుత్వాలు వైఫల్యం అయ్యాయని తెలిపింది. ఈ నెల 10న ఢిల్లీ, పంజాబ్ , హర్యానా, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తన ముందు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై మానవ హక్కుల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టికల్ 47 ప్రకారం ప్రజారోగ్యం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. దీంతో పాటు ఈ మధ్య కాలంలో తమ ప్రాంతాల్లో పొగను నివారించడానికి చేపట్టిన చర్యల గురించి తెలియజేయాలని ఆదేశించింది. ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఇంకా చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కమిషన్ అభిప్రాయపడింది.