మునుగోడులో ఉపన్యాసాలు తప్ప నిధుల మాటేది ?

  • ఎలాంటి హామీ ఇవ్వకుండా కెసిఆర్‌ను తిట్టే పని పెట్టారు
  • పోలీస్‌ ‌వ్యవస్థను దుర్వినియోగం చేసిన చరిత్ర టిఆర్‌ఎస్‌కు లేదు
  • ప్రచారంలో బిజెపి నేతల తీరు దారుణమన్న మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికల్లో వందల ఉపన్యాసాలు ఇచ్చిన బీజేపీ నేతలు నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క హామీ అయినా ఇవ్వలేక పోయారని మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి మండిపడ్డారు. ప్రజలను ఏమని ఓట్లు అడిగారో తెలుసా అని ప్రశ్నించారు. వందల ఉపన్యాసాల్లో మునుగోడు అభివృద్ధికి ఒక్క హామీ అయినా ఇచ్చారా అని నిలదీసారాఉ. కేసీఆర్‌ను బూతులు తిట్టడం, నోటికొచ్చిన అబద్దాలు మాట్లాడటమే ప్రచారామా అని నిలదీశారు. మునుగోడు మండలం పలివెలలో బీజేపీ నాయకులు పాల్పడ్డ రాళ్ల దాడిపై జగదీశ్‌ ‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.తెలంగాణలో 2014కు ముందు జరిగిన అభివృద్ధిని, ప్రస్తుత అభివృద్ధిని పరిశీలించాలని మంత్రి సూచించారు. కేంద్రంలో, తెలంగాణలో జరిగిన అభివృద్ధిని పోల్చి చెప్పాలి. గుజరాత్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌యూపీలో జరిగిన అభివృద్ధిని తెలంగాణతో పోల్చి చెప్పాలి. కేసీఆర్‌ ‌వైపు భారతదేశ ప్రజలు ఎందుకు చేస్తున్నారు. కేసీఆర్‌ను నిలువరించాలని బీజేపీ ఎందుకు కుట్రలు చేస్తుంది. తెలంగాణలో అభివృద్ధే జరగకపోతే యూపీ, గుజరాత్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌కశ్మీర్‌ ‌ప్రజలు ఎందుకు మాట్లాడుకుంటున్నారని ప్రశ్నించారు. దీనికి ఈటల రాజేందర్‌ ‌సమాధానం చెప్పాలన్నారు. ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ప్రజలకు తెలియదా అని అన్నారు. బీజేపీ చరిత్రనే దాడులు, దుర్మార్గులు, అది భయం గొలిపే పార్టీ. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎవరి మీద దాడి చేయలేదు.

బీజేపీ అగ్ర నాయకులు మనుషులను మాయం చేస్తున్నారు. దళితులను దుర్మార్గంగా హింసిస్తున్నారు. దళిత మహిళలపై అత్యాచారాలు చేస్తూ, సాక్షులను చంపేస్తున్నారు. అంత దుర్మార్గమైన పార్టీలో ఉండి ధర్మం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. నన్ను రానివ్వకుండా అడ్డుకున్నదే బీజేపీనే కదా? అని మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి నిలదీశారు. జనాలు లేక మీరు సభలను రద్దు చేసుకున్నారు. మీ సభలకు టీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు అడ్డుపడలేదు. మీ నాయకులే భయపడు తున్నారు. ఇప్పటికే బీజేపీలో వందల మంది మాయం అయిపోయారు. ఇది బీజేపీ నైజం. రాజ్యాంగ బద్ధసంస్థలను దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. కేసులతో ప్రతిపక్షాలను బ్లాక్‌ ‌మెయిల్‌ ‌చేస్తున్నారు. సానుభూతి పొందేందుకు మీరు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని జగదీశ్‌ ‌రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఎన్నికల్లో కూడా రాజకీయ ఘర్షణలు చోటు చేసుకోలేదు అని స్పష్టం చేశారు. ఒకచిన్న రాజకీయ కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. పోలీసులను టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడదని ఈటల రాజేందర్‌కు తెలుసు అని మంత్రి పేర్కొన్నారు.

ఏ ఒక్కరోజు కూడా టీఆర్‌ఎస్‌ ‌పార్టీ పోలీసులను వాడుకోలేదు. పోలీసులను రాజకీయాల్లో ఉపయోగించకూడదనేది కేసీఆర్‌ ఆలోచన. పోలీసుల ట్రాన్స్‌ఫర్స్ ‌గురించి ఎవరైనా నాయకులు అడిగితే కూడా కేసీఆర్‌ ‌తిరస్కరించే వారని మంత్రి గుర్తు చేశారు. ఓటమికి సాకులు వెతుక్కునే క్రమంలో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని ధ్వజమెత్తారు. నియోజకవర్గాలకు నిధులు ఎక్కడా ఆగలేదు. ఒక వేళ నిధులు ఆగాయంటే.. దానికి కేంద్రమే కారణం. కేంద్రం తన వాటా ఇవ్వకపోవడం వల్లనే కొన్ని చోట్ల నిధులు ఆగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఠంచన్‌గా నిధులను మంజూరు చేస్తుంది. ఇలాంటిది బీజేపీ పాలిత రాష్టాల్ల్రో ఉంటే చూపించాలి అని జగదీశ్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. ప్రచారం ముగిసిన తర్వాత అక్కడ్నుంచి అందరూ వెళ్లిపోవాలని చెప్పింది ఎన్నికల సంఘమే కదా? ఏ ఒక్క రోజు కూడా మిమ్మల్ని ఎవరూ ఆపలేరు.

గత మూడు నెలల నుంచి మునుగోడులో తిరుగుతున్నారు. ప్రజల నుంచి ఆదరణ లేదు బీజేపీకి. ఏ కారణం చేత ఇవాళ ఉప ఎన్నిక తెచ్చారు. తెలంగాణలో ప్రజలకు ఉన్న భద్రత మీరు ఇతర రాష్టాల్ల్రో ఎక్కడైనా చూపించగలరా అని జగదీశ్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. మహిళలకు రక్షణగా ఉన్నాం. ఈవ్‌ ‌టీజింగ్‌ ‌లేదు. బీజేపీ పాలిత రాష్టాల్లో్ర మహిళలకు రక్షణ కరువైంది. రాష్ట్రంలో షీ టీమ్స్ అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. తెలంగాణ ప్రజలకు విజ్ఞత, చైతన్యం ఉంది. పాలను, నీళ్లను వేరు చేసే శక్తి ఉంది. ధర్మం వైపు ఎవరున్నారు. అధర్మం వైపు ఎవరు ఉన్నారనేది ప్రజలకు తెలుసు అని జగదీశ్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ నాయకుల ఇంట్లో పోలీసులు సోదాలు చేయలేదు. ఈడీ, ఐటీలు టీఆర్‌ఎస్‌ ‌నాయకుల నివాసాల్లో దాడులు చేశాయి. కేంద్ర బలగాలతో ప్రజలను భయపెట్టిస్తున్నారు. నిన్న దాడులు జరిగిన సమయంలో పోలీసులు సంయమనం పాటించారు. రాజేందర్‌ ‌పీఏనే టీఆర్‌ఎస్‌ ‌శ్రేణులపై రాళ్ల దాడి చేశారు. అబద్దాలు ఎప్పుడు నిజం కావు. సత్యం ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ నూటికి నూరు శాతం భారీ విజయంతో గెలుస్తుంది. మేం శాంతియుతమైన పద్ధతుల్లోనే ముందుకు పోతున్నాం. ఎవరెన్ని దాడులకు పాల్పడినా తమ ఆత్మస్థైర్యం దెబ్బతినదు అని జగదీశ్‌ ‌రెడ్డి తేల్చిచెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page