మేడ్చల్ జిల్లా లో ప్రవేశించిన భారత్ జోడో

 

– రాహుల్ రాకతో జనసంద్రమైన రోడ్లు..

– స్థానిక నాయకుల ఘనస్వాగతం…

మేడ్చల్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబరు 02: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపడుతున్న జోడో యాత్ర జోరందుకున్నది. స్థానిక నాయకులతో కలిసి బుధవారంకూకట్ పల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈసందర్భంగా బాలానగర్ శోభన వద్ద కాంగ్రెస్ శ్రేణులు, విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున కళాకారుల డప్పుల వాయిద్యాలతో రాహుల్ గాంధీ పాదయాత్రకు ఘన స్వాగతం పలికారు. ఈ యాత్రలో వేలాది మంది కార్యకర్తలు నాయకులు పాల్గొనడంతో రహదారి అంత జనసంద్రంగా మారింది. పాదయాత్రలో మువ్వన్నెల కాంగ్రెస్ జెండా రెపరెపలతో కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. తమ అధినేతతో స్వయంగా పాదయాత్ర చేసే అవకాశం రావడంతో తెలంగాణ నలుమూలల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జోడయాత్ర స్థానిక నియోజకవర్గంలోని బాలానగర్ నుండీ మూసాపేట్ వై జంక్షన్, కూకట్ పల్లి, ప్రధాన రహదారి వెంబడి కేపీహెచ్ బి నుండీ మియాపూర్ చేరుకుంది. స్థానిక నాయకులతో ఉత్సహాభరితంగా సాగిన జోడో యాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సీతక్క మల్లు భట్టి విక్రమార్క మాణిక్యంఠాకూర్ పాటు పలువురు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, యువజన మహిళా, విద్యార్థి మరియు స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page