*ప్రాచీన కళారూపం గురించి వివరించిన సీఎల్పీ నేత భట్టి
భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క ఏర్పాటు చేయించిన అతీ ప్రాచీనమైన నగా రాభేరి కళారూపాన్ని మంగళవారం శంషాబాద్ వద్ద భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ జీ ఎదుట ప్రదర్శించారు. కొమ్ము బూరలు ఊదుతూ నగారా భేరీ వాయిస్తున్న కళాకారుల మధ్యలోకి రాహుల్ వెళ్లి డోలు వాయించి కళాకారులను ఉత్సాహపరిచారు.
నిజాం నవాబు కాలం నాటి ఈ కళా రూపం
విశిష్ట మైన ఈ” నగారా భేరీ“లను అత్యంత విశిష్ట మైన వ్యక్తులు వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగించుట ఆనవాయితీగా వస్తోందని, భారత్ జోడో యాత్ర లో భాగంగా *హైదరాబాద్ కు వచ్చిన విశిష్ట అతిథి (రాహుల్ గాంధీ) మీరే కాబట్టి ఈ కళారూపాన్ని ఏర్పాటు చేసినట్లు భట్టి విక్రమార్క చెప్పడంతో…. థాంక్స్ భట్టి జీ అంటూ రాహుల్ ప్రశంసించారు.
ప్రస్తుతం బిర్లా మందిరం ఏర్పడిన స్థానంలో నౌ భత్ పహాడ్ పై నగారా భేరి మోగించి నిజాం రాకను మరియు వార్త ప్రచార సంకేతానికి ఉపయోగించేవారని చెప్పారు.
కాకతీయుల కాలంలోను ఈ నగారా భేరిని యుద్ద సమయాల్లోను ఉపయోగించారు అని, దేవాలయ కుడ్య చిత్రాల ద్వారా విదిత మవుతుందని భట్టి వివరించారు. దాదాపు 500. సం..ల చరిత్ర కలిగిన ఈ అపురూపమైన కళారూపం. ఇటీవల “లోక కళ. మౌస పరిషత్” వారు ఆదరించి పునర్వైభవానికి పాటు పడుతున్నారని రాహుల్ గాంధీ కి భట్టి విక్రమార్క వివరించారు.