పాక్‌లోనూ హర్షాతిరేకాలు
రిషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికైన నేపథ్యంలో పాకిస్థాన్‌లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సునాక్ తాత, మామ్మ అవిభాజిత భారతదేశంలోని గుజ్రన్‌వాలా నగరంలో జన్మించారు. ఇప్పుడా నగరం పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఉంది. దీంతో రిషి సునాక్ తమ వాడని ప్రకటించాలంటూ పాకిస్థాన్‌లోని నెటిజన్లు పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
రిషి తాత రాందాస్ సునాక్ కెన్యాలోని నైరోబీలో క్లర్క్ ఉద్యోగం చేసేందుకు 1935లో గుజ్రన్‌వాలా నుంచి తరలిపోయారు. రాందాస్ భార్య సుహాగ్ రాణి సునాక్ తన అత్తగారితో కలిసి గుజ్రన్‌వాలా నుంచి ముందు ఢిల్లీకి వెళ్లారు. ఆ తర్వాత 1937లో ఆమె కెన్యా వెళ్లారు’ అంటూ సౌత్ ఆంప్టన్లో రిషి సునాక్ జన్మించే వరకు ఆయన పూర్వీకుల వివరాలను క్వీన్ లైనెస్ 86 పేరుతో ట్వీటర్లో ఉంచారు.