రోడ్డుపై బోల్తాపడిన ఇంధన ట్యాంకర్ నుంచి ఇంధనాన్ని తీసుకొచ్చుకునేందుకు వెళ్లి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఇండోర్‌కు తరలించారు. మరో 10 మంది క్షతగాత్రులు ఖర్గోన్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారంఉదయం ఆరు గంటల సమయంలో ఇండోర్ నుంచి ఖర్గోన్ వైపు వెళ్తున్న ఇంధన ట్యాంకర్ అంజన్గావ్ గ్రామం సపంలో మూల మలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. దాంతో సప గ్రామస్తులు ఇంధనాన్ని ఎత్తుకెళ్లేందుకు ఎగబడ్డారు.
అదేసమయంలో ట్యాంకర్లో మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవదహనమయ్యారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.