గ్రహ రాజులకు గడ్డు కాలమా?
కమ్మేసిన నీడభూత ఛాయలా?
గతి తప్పిన మూఢనమ్మకాలు
మతి లేని పాతప్రమాణాలు!
ముక్కు మూసుకుని
బామ్మ పెరట్లో స్నానం చేస్తుంటే
చాదస్తం అనుకున్నా!
కళ్ళు మూసుకుని ధ్యానంలో
తాత సమయాన్ని గడుపుతుంటే
అజ్ఞానం అనుకున్నా!
చీకటి వెలుగుల
దోబూచులను ప్రశ్నించా!
పట్టు విడుపులు
ప్రహసనాలను పరిహాసించా!
పడగవిప్పిన కాలసర్పం
గమనానికి తంత్రం పెట్టేసింది!
అనువు గాని వేళ చీకటి
తరుణం కుతంత్రం చేసేసింది!
ఓపికతో సావాసం
చేటు సమయానికి
తరుగుడు జంత్రంమని!
ఓరిమి ధ్యానం
ఆపత్కాలానికి
విరుగుడు మంత్రమని!
కలిమిలేమిలు
చక్ర భ్రమణంలో సహజమని!
కష్ట సుఖాలు
ఎదురు పార్శ్వములని!
జ్ఞానం వికసించిన అనుభవం
మబ్బులు తొలగిన సూర్యుడిలా!
గ్రహణం విడిచిన చంద్రుడిలా
నన్ను మార్చింది!
– ఉషారం, 9553875577