మీరే నన్ను మారుస్తున్నారు
నేను నడిచే దారిని వంపుతూ
నన్ను విరుస్తున్నారు
నా చేత మీవైనవి చేయిస్తూ
నన్ను మిమ్మల్నిగా
రూపంతంతరం గావిస్తూ
ఆవిరి చేస్తున్నారు
ఇంకేమి మాటాడను
నేనేమన్నా అది మీరే
మీ నుంచి వచ్చినవిగానే ఉంటయ్
ఎలా ఉన్నా మీకు అసంతృప్తే
మౌనంగా మెగిలినా…
పోనీ కనిపించకుండా పోనా
నా అస్తిత్వం మీ కంట పడకుండా
మీకు ఉపశమం ఇవ్వనా
పలు విధాల మీకు
నా గాలి లేకుండా
ఒక బుడగనై
నన్ను నేను వదిలేసుకుంటా
ఆ శూన్యంలోకి
ఒకానొక వ్యోమ నౌకలోకి
ఆ ఖాళీలోకి
ఆ నల్లని
అనంతంలోకి
వినిపించకుండా
పూర్తిగా…
ఒక శకలమై
ముక్కలుగా రాలిపోతా
ఆ మధ్యలోనే…
ఎవ్వరికీ చెందక
దేనిలో ఇమడక
ఒక విశ్వజనీన సూత్రమై
మిగులుతా…
– రఘు వగ్గు