మంత్రి హరీష్‌ ‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి మర్రిగూడెం బీజేపీ, కాంగ్రెస్‌ ‌నాయకులు

నల్గొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 12 : ‌బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీల నీచ రాజకీయాల వల్ల మునుగోడులో ఉప ఎన్నిక వచ్చిందని మంత్రి హరీష్‌ ‌రావు విమర్శించారు. టీడీపీతో బీజేపీ కుమ్మక్కై తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తున్నారని, బీజేపీ కి లాభం చేసే కుట్రలో భాగంగానే టిడిపి మునుగోడు లో పోటీ చేస్తుందని తెలంగాణ ద్రోహులకు బుద్ధి చెప్పాలని మునుగోడు ప్రజల ను కోరారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అని ప్రశ్నించారు. బీజేపీ వస్తే రైతుల బావుల వద్ద మీటర్లు పెడతారని, ఉచిత విద్యుత్‌ ‌తీసేస్తారని హెచ్చరించారు.
ఈ సందర్భంగా హైద్రాబాదులో జరిగిన కార్యక్రమంలో మునుగోడులోని మర్రిగూడెం మండల నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు. చేరిన వారిలో బీజేవైఎం మండల అధ్యక్షుడు సిలివేరు రఘు, బీజేపీ మండల ఉపాధ్యక్షులు పోలె సైదులు, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకులు పొనుగోటి భాస్కర్‌ ‌రావు, మండల కాంగ్రెస్‌ ‌నాయకులు శ్రీనివాస్‌ ‌సహా 30 మంది కార్యకర్తలు ఉన్నారు.
వారికి మంత్రి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన నాయకులు మాట్లాడుతూ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ‌గెలుపు కోసం పని చేస్తామని వెల్లడించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి నియోజకవర్గానికి చేసింది శూన్యమని, తమ ప్రాంత అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నామని తెలిపారు.
మునుగోడులో టీఆర్‌ఎస్‌కు అరె కటిక సంఘం మద్ధతు
ధన అహంకారంతో రెచ్చిపోతున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డికి తగిన గుణపాఠం చెప్తామని తెలంగాణ అరెకటిక సంఘం తెలిపింది. కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయిన వ్యక్తికి కాకుండా, అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకునే టీఆర్‌ఎస్‌ ‌పార్టీని మునుగోడులో గెలిపిస్తామని వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర అరెకటిక సంఘం తరపున టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు.
బుధవారం హైదరాబాద్‌ ‌లో మంత్రి హరీష్‌ ‌రావు సమక్షంలో కుల సంఘ పెద్దలు ఈ మేరకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆరు మండలాల ఆరెకటిక సంఘం వారు టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో జాయినవగా, మంత్రి వారిని కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు హకీంకారి సువేందర్‌ ‌జీ, ఉపాధ్యక్షులు కళ్యాణ్‌ ‌కార్‌ ‌జహంగీర్‌ ‌జీ, ప్రధాన కార్యదర్శి కళ్యాణ్‌ ‌కార్‌ ‌శివప్రసాద్‌, ‌మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page