కోనసీమలో బిఆర్‌ఎస్‌ ‌ఫ్లెక్సీలు

  • అప్పుడే అభ్యర్థిగా ప్రచారం చేస్తూ ప్రకటనలు
  • రేవు అమ్మాజీరావు పేరుతో ఫ్లెక్సీల అవతరణ

అమలాపురం,అక్టోబర్‌7: ‌కేసీఆర్‌ ‌కొత్త పార్టీపై చర్చ నడుస్తున్న క్రమంలో కోనసీమ బీఆర్‌ఎస్‌ ‌పార్టీ పేరుతో వెలసిన ప్లెక్సీలు కలకం సృష్టిస్తున్నాయి. పార్టీ పేరు ప్రకటన మినహా కేసీఆర్‌ ఏ ‌రాష్ట్రం లోనూ అధికారికంగా పార్టీ కమిటీలను గాని, నియోజకవర్గ ఇన్‌ ‌ఛార్జిలను ప్రకటి ంచలేదు. అయినప్పటికి కోనసీమలోని అమలాపురం పట్టణంలో అమలాపురం పార్లమె ంటు నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ ఏం‌పీ అభ్యర్థి నంటూ ప్లెక్సీలు వెలిశాయి. రేవు అమ్మాజీరావు పేరుతో ఈ ప్లెక్సీలను ఏర్పాటుచేశారు. పార్టీ పేరు ప్రకటించిన రెండు రోజుల్లోనే ఏపీలో బ్యానర్లు వెలవడంపై స్థానికులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో కూడా కేసీఆర్‌ ‌పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్లేక్సీలు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనమే సృష్టించింది. ఆంధ్రప్రదేశ్‌ అం‌దులోనూ కోనసీమలో ఆయన ప్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారనే చర్చకూడా నడిచింది. తాజాగా బీఆర్‌ఎస్‌ ‌పార్టీ పేరుతో ప్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది.

అయితే దీనిపై బీఆర్‌ఎస్‌ ‌పార్టీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయితే కనీసం కమిటీలు కూడా ప్రకటించకుండా ఏకంగా తాను ఏంపీ అభ్యర్థినంటూ ప్రకటించు కోవడం కూడా కలకలం రేపుతోంది. బీఆర్‌ఎస్‌ ‌నాయకులకు తెలిసే ఈప్లెక్సీలను ఏర్పాటు చేశారా, లేదా దీని వెనుకాల ఏదైనా రాజకీయ వ్యూహాం ఉందా అనేది కూడా తెలియాల్సి ఉంది. అసలు బీఆర్‌ ‌పార్టీ ప్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఆంధప్రదేశ్‌ ‌లో ఎలాంటి రియాక్షన్‌ ఉం‌టుందనేది విషయం తెలుసుకోవడానికి కూడా ఎవరైనా ఈ బ్యానర్లు కట్టారా అనే అనుమానాలను కొంతమంది లేవనె త్తుతున్నారు. తెలంగాణ సీఏం కేసీఆర్‌ ‌తన టీఆర్‌ఎస్‌ ‌పార్టీ పేరును బీఆర్‌ ఎస్‌ ‌గా మారుస్తూ.. ఇక నుంచి జాతీయ రాజకీయాల్లో అరంగ్రేటం చేస్తున్నట్లు ప్రకటించారు. తొలుత కర్ణాటక, మహారాష్ట్రలో పార్టీ కార్యాచరణను ప్రారంభిస్తామని వెల్లడించారు.

దశలవారీ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని కూడా ప్రకటించారు. అయితే కేసీఆర్‌ ‌కొత్త పార్టీ ఆంధప్రదేశ్‌ ‌లో పోటీ చేస్తుందా లేదా అనే చర్చ గత కొద్దిరోజులుగా సాగుతోంది. కేసీఆర్‌ ‌పై ఆంధప్రదేశ్‌ ‌ప్రజలు వ్యతిరేకంగా ఉంటారని, ఆయన ఏ అజెండాతో ఏపీలో పోటీ చేస్తారనే అభిప్రాయాలు కొన్ని రాజకీయ పక్షాల నుంచి వినిపిస్తున్నాయి. తాజాగా బీజేపీ నేత జీవీఎల్‌.‌నరసింహరావు కూడా బీఆర్‌ ఎస్‌ ‌పార్టీపై స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ ‌కు బీఆర్‌ఎస్‌ ‌రావాలని, అదే సమయంలో తాము ఆ పార్టీని ప్రశ్నిస్తామంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ‌లో అధికార వైసీపీ కూడా కేసీఆర్‌ ‌బీఆర్‌ ఎస్‌ ‌పార్టీపై ఆచీతూచీ స్పందించింది. ప్రస్తుతానికి పార్టీ పేరు ప్రకటించారు మినహా, రాజకీయ అజెండాను, వచ్చే ఎన్నిక్లలె ఏయే రాష్టాల్ల్రో పోటీ చేస్తామనేది స్పష్టంగా చెప్పలేదు.

దీంతో కేసీఆర్‌ ‌స్పష్టత ఇచ్చిన తర్వాత స్పందిద్దామనే ధోరణిలో మరికొన్ని రాజకీయ పక్షాలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలను తాము స్వాగతిస్తామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కేసీఆర్‌ ‌పార్టీతో తమకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదని మంత్రి బొత్స సత్యనారాయణ కూడా వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ ‌ను కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించినప్పటికి, అది కొంత కాలం ప్రాంతీయ పార్టీగానే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా రాజకీయ పార్టీ జాతీయ పార్టీ గుర్తింపు పొందాలంటే దానికి కొన్ని నిబంధనలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశిరచింది.

దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించడం కోసం కేసీఆర్‌ ‌తన పార్టీ పేరును మార్చినప్పటికి అది జాతీయ పార్టీగా అవతరించాలంటే ఎన్నికల సంఘం నిర్దేశించిన లక్షణాలు కలిగి ఉండాలి. దీంతో వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ‌తరపున పోటీ చేసినా, అది జాతీయ గుర్తింపు పొందేవరకు ఆ ప్రాంతంలోని ప్రాంతీయ పార్టీగానే పరిగణి స్తారు. దీంతో ఏపీలో పార్టీ కార్యకలాపాలపై కేసీఆర్‌ ‌స్పష్టమైన ప్రకటన ఏమి చేయలేదు. అయితే నాయకులు మాత్రం కొంతమంది తాము బీఆర్‌ ఎస్‌ అం‌టూ ప్రచారం మొదలుపెట్టడం ఇప్పుడు కోనసీమ ప్రాంతంలో హట్‌ ‌టాపిక్‌ ‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page