జనగామలో కాన్వాయ్ దిగి సమస్యలపై ఆరా
హన్మకొండలో వినతిపత్రాన్ని మొఖాన కొట్టిన వైనం
సిఎం కెసిఆర్ వైఖరిపై విఆర్ఏల విస్మయం
హనుమకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 1 : వీఆర్ఏ సంఘం నేతలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ హావి•లు నెరవేర్చాలని వారు సీఎం కేసీఆర్‌కి వినతి పత్రం అందించగా..వీఆర్ఏల ఫిర్యాదును కోపంతో వారిపైకే కేసీఆర్ విసిరివేశారు. డ్రామాలాడుతున్నారంటూ వీఆర్ఏ సంఘం నేతలపై సీఎం ఫైర్ అయ్యారు. మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నేత అయిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి కేసీఆర్ వెళ్లిన నేపథ్యంలో ఆయన్ని వీఆర్ఏ సంఘం నాయకులు కలిసినప్పుడు ఈ సంఘటన జరిగింది.
ఈ పరిణామంతో వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇదిలా వుండగా అంతకుముందు జనగామ వద్ద సీఎం కేసీఆర్‌కు నిరసన సెగ తగిలింది. ముఖ్యమంత్రి కాన్వాయ్ ముందు వీఆర్ఏలు ప్లకార్డులు ప్రదర్శించారు. నిరసన కారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. వీఆర్ఏల ఆందోళనలతో సీఎం కేసీఆర్ కాన్వాయ్ దిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే హనుమకొండలో మాత్రం వారిపై కేసీఆర్ ఈ విధంగా స్పందించడం విఆర్ఏలను విస్మయానికి గురిచేసింది.