నితీష్‌ ‌ఫెవికాల్‌లా అతుక్కు పోగలరు

తాజాగా సిఎంతో ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌చర్చలు
పాట్నా, సెప్టెంబర్‌ 14 : ‌బీజేపీని వీడి రాష్ట్రీయ జనతాదళ్‌ ‌తో కలిసి మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నితీష్‌ ‌కుమార్‌ ఇప్పు‌డు మరింత దూకుడు పెంచారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నారు. మిషన్‌ 2024 ‌కోసం తీవ్రంగా ప్రయత్ని స్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఢిల్లీ వెళ్లి పలు విపక్షాల నేతలతో సమావేశమయ్యారు. కాగా, మంగళవారం సాయంత్రం నితీష్‌ ‌కుమార్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ ‌కిషోర్‌ ‌భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి నివాసంలో ఇరువురి మధ్య దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిగాయి. ఈ భేటీలో పవన్‌ ‌వర్మ కూడా ఆయన వెంట ఉన్నారు. ప్రశాంత్‌ ‌కిషోర్‌ ‌ను వెంట తెచ్చుకునే బాధ్యతను పవన్‌ ‌వర్మకు అప్పగించినట్లు సమాచారం. అయితే, గతంలో బీహార్‌ ‌సీఎంపై నిరంతం విమర్శలు గుప్పించే ప్రశాంత్‌ ‌కిషోర్‌.. ఈ ‌సారి మాత్రం సెటైర్లు సంధించారు.

’ఫెవికాల్‌’ ‌బ్రాండ్‌ అం‌బాసిడర్‌గా ఉండాలని నితీష్‌ ‌కుమార్‌ ‌గురించి ప్రశాంత్‌ ‌కిషోర్‌ అన్నారు. ’ఫెవికాల్‌ ‌కంపెనీ వ్యక్తులు నన్ను కలిస్తే, నితీష్‌ ‌కుమార్‌ను బ్రాండ్‌ అం‌బాసిడర్‌గా చేయమని నేను వారికి సలహా ఇస్తాను. ప్రభుత్వం ఎవరిదైనా ఆయన మాత్రం కుర్చీకి అతుక్కుపోతారంటూ కామెంట్‌ ‌చేశారు. మహాకూటమిలోని సభ్యులు ఇకపై కలిసి ఉండరని అన్నారు. ఇక నితీష్‌ ‌కుమార్‌ ‌చుట్టూ తిరగరని ఎవరూ హా ఇవ్వలేరని ప్రశాంత్‌ ‌కిషోర్‌ అన్నారు. బీహార్‌లో జరిగే రాజకీయ పరిణామాలు దేశ రాజకీయాలపై ప్రభావం చూపుతాయా అని ప్రశాంత్‌ ‌కిషోర్‌ను డియా అడిగిన ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం చెప్పారు. అలా జరుగుతుందని తాను అనుకోవడం లేదన్నారు.

ఇది రాష్టాన్రికి సంబంధించిన ప్రత్యేక సమావేశం అని స్పష్టం చేశారు. దీని ప్రభావం బీహార్‌కే పరిమితం అని అన్నారు. జాతీయ రాజకీయాలపై పెద్దగా ప్రభావం చూపుతుందన్న నమ్మకం తనకు లేదన్నారు. బీహార్‌లో తదుపరి అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏర్పాటులో జరగవని నా రాజకీయ అవగాహన ఆధారంగా తాను ఖచ్చితంగా చెప్పగలనన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page